భయం వద్దు.. పుకార్లు నమ్మొద్దు.. తెలంగాణలో ఇంధన సరఫరా 126% పెంపు

తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​కు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఇంధన సరఫరా భారీగా పెరిగింది. ప్రభుత్వం 126% వరకు సరఫరా పెంచి వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. పక్క రాష్ట్రాల నుండి కూడా తాకిడి ఎక్కువవడంతో, ప్రజలు భయాందోళనలతో అనవసరపు కొనుగోళ్లు జరుపుతున్నారు. రైతులకు కూడా పూర్తిస్థాయిలో ఇంధనం అందుబాటులో ఉండేలా కఠిన చర్యలు చేపట్టింది.

తెలంగాణలో పుకార్ల కారణంగా పెట్రోల్ బంక్ వద్ద భారీ క్యూ లైన్లు

పుకార్ల ప్రభావంతో పెట్రోల్ బంక్‌ల వద్ద భారీగా క్యూలలో నిలిచిన వాహనాలు

Telangana Boosts Fuel Supply by 126% to Tackle Panic Buying, Cross-Border Demand

      తెలంగాణలో ఇంధన సరఫరా భారీగా పెంపు

పానిక్ బైయింగ్, సరిహద్దు డిమాండ్ నేపథ్యంలో ప్రభుత్వం 126% సరఫరా పెంచింది. రైతులకు ఇంధనం అందుబాటులో ఉండేలా కఠిన చర్యలు అమల్లో ఉన్నాయి.

 

విధాత సిటీ బ్యూరో | 28 ఏప్రిల్​ 2026 | హైదరాబాద్​:

Telangana Fuel : హైదరాబాద్: రాష్ట్రంలో అకస్మాత్తుగా పెరిగిన ఇంధన డిమాండ్‌ను అదుపులోకి తీసుకురావడానికి తెలంగాణ పౌర సరఫరాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పెట్రోలియం సరఫరాను 126 శాతం వరకు పెంచినట్లు అధికారులు వెల్లడించారు. భయాందోళనలతో పెట్రోల్​ బంకుల వద్ద భారీ లైన్లు, సరిహద్దు ప్రాంతాల్లో భారీ కొనుగోళ్లు, పుకార్ల ప్రభావం వల్ల ఇంధన బంకులు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ, పెట్రోల్​ పంపుల్లో ఏర్పడిన అసాధారణ డిమాండ్‌ను తగ్గించేందుకు తక్షణ చర్యలు తీసుకున్నాం. సరఫరా పెంపుతో పరిస్థితిని స్థిరీకరించేందుకు కృషి చేస్తున్నామన్నారు.

డిమాండ్ పెరగడానికి మూడు ప్రధాన కారణాలు

ఇంధన డిమాండ్ ఒక్కసారిగా పెరగడానికి మూడు ముఖ్య కారణాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.

3,100 ట్యాంకర్లతో సరఫరా.. బంకులపై కఠిన నిఘా

ఇంధనంపై భయంతో హైదరాబాద్‌లో పెట్రోల్ బంక్‌ల వద్ద పెరిగిన రద్దీ

ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు అత్యవసర ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం, భారీ స్థాయిలో సరఫరా పెంచింది. రాష్ట్రవ్యాప్తంగా 3,100 ఇంధన ట్యాంకర్లను రంగంలోకి దించారు.

పంట కోతలు, ధాన్యం కొనుగోలు ప్రక్రియల్లో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రస్తుత పరిస్థితుల్లో పుకార్లకు లోనవకుండా అవసరమైనంత మాత్రమే ఇంధనం కొనుగోలు చేయాలని అధికారులు ప్రజలకు సూచించారు. అనవసర భయాలు వద్దని, రాష్ట్రంలో సరిపడా పెట్రోల్​, డీజిల్​ నిల్వలున్నాయని స్పష్టం చేసారు. సరఫరా స్థిరంగా ఉండటంతో త్వరలో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకునే అవకాశముంది.

Latest News