Bulletu Bandi | విధాత : రాఘవా లారెన్స్(Raghava Lawrence) ప్రధాన పాత్రలో నటిస్తున్న‘బుల్లెట్టు బండి’(Bulletu Bandi) మూవీ నుంచి టీజర్ విడుదలైంది. లారెన్స్ సోదరుడు ఎల్విన్ ఈ సినిమా ద్వారా వెండితెరకి పరిచయం అవుతున్నాడు. ఇన్నాసి పాండియన్ దర్శకత్వం వహిస్తున్న‘బుల్లెట్టు బండి’ మూవీ టీజర్ ను అక్కినేని నాగ చైతన్య విడుదల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఓ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో లారెన్స్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు.
టీజర్ ఈ సినిమాలోని క్రైమ్ సస్పెన్స్ అంశాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేలా కనిపించింది. బుల్లెట్ బండి చుట్టు కథ సాగుతుందని తెలుస్తుంది. ఈ సినిమాకు సామ్ సీఎస్ సంగీతం అందిస్తుండగా.. కథిరేశన్ ఈ చిత్రాన్ని ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. తెలుగులో పాటు తమిళంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా.. సునీల్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.
Read more- Constable kanakam | థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ ‘కానిస్టేబుల్ కనకం’
Kantara Chapter 1 : ‘కాంతార చాప్టర్ -1’ నుంచి కనకవతి పోస్టర్ రిలీజ్