నటీనటులు : ఎన్టీఆర్, జాన్వీకపూర్, సైఫ్ అలీఖాన్, శ్రుతి మరాఠే, ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో తదితరులు
సంగీతం : అనిరుధ్ రవిచందర్
సినిమాటోగ్రఫీ : ఆర్.రత్నవేలు
ఎడిటింగ్ : ఎ.శ్రీకర్ ప్రసాద్
నిర్మాత : సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ, నందమూరి కల్యాణ్‌రామ్
రచన, దర్శకత్వం: కొరటాల శివ
Devara Review | జూనియర్ ఎన్టీఆర్( Jr. NTR ).. ఈ పేరు వింటేనే ఆయన అభిమానుల్లో రొమాలు నిక్కపొడుస్తాయి.. సముద్రం అలలతో ఉప్పొంగినట్టు అభిమానుల్లో సంతోషం ఉరకలేస్తోంది. కొరాటల శివ( Koratala Shiva ) దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర చిత్రం( Deavara Movie ) ఇవాళ విడుదలై.. థియేటర్లలో మాస్ జాతరను సృష్టించింది. నిజంగానే ఎర్ర సముద్రం( Red Sea ) పోటెత్తిందా..? అన్నట్టు అభిమానులు థియేటర్లలో వాలిపోయి.. దేవర మూవీని వీక్షించారు. థియేటర్లన్నీ ఎన్టీఆర్ నినాదాలతో మార్మోగిపోయాయి. మరి ఇవాళ విడుదలైన దేవర మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం..
ఆర్ఆర్ఆర్( RRR ) మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) సోలో హీరోగా చేసిన చిత్రం దేవర. ఈ సినిమాలో జాన్వీ కపూర్( Janhvi Kapoor ) కథానాయికగా నటించింది. తెలుగు ప్రేక్షకులకు ఆమె ఈ సినిమా ద్వారానే పరియమైంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్(Saif Ali Khan ) నేరుగా టాలీవుడ్( Tollywood )లో చేసిన చిత్రం ఇది. ఈ సినిమా కొరటాల శివ( Koratala Shiva ) దర్శకత్వంలో తెరకెక్కింది. గతంలో వీరిద్దరూ కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్( Janatha Garage ) ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో తెలుగు సినీ లవర్స్‌కు తెలిసిందే. మరి వీరిద్దిరి కాంబోలో తెరకెక్కిన దేవర సినిమా నేడు విడుదలైంది. జనతా గ్యారేజ్ మాదిరిగానే ఈ సినిమా హిట్ కొట్టబోతుందా..? అభిమానుల అంచనాలను అందుకుందా..? ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం మెప్పించిందా..? అసలు దేవర కథేంటి..? అనే విషయాలను తెలుసుకుందాం..
దేవర కథ సంక్షిప్తంగా..( Devara Review )
దేవర సినిమా( Devara Cinema ) రెండు రాష్ట్రాల సరిహద్దుల ఉన్న సముద్రం నేపథ్యంలో ప్రధానంగా సాగింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లో రత్నగిరి( Ratnagiri ) అనే ప్రాంతం ఉంటుంది. ఈ ప్రాంతంలోనే సముద్రానికి అనుకుని ఉన్న ఓ గుట్టపై నాలుగు ఊర్లను కలిపి ఎర్ర సముద్రం( Red Sea ) అని పిలుస్తారు. ఇక ఈ సముద్రానికి బ్రిటీష్ కాలం నుంచే ఓ పెద్ద చరిత్ర ఉంటుంది. అయితే ఆ నాలుగు ఊర్ల ప్రజల అవసరాల కోసం దేవర(ఎన్టీఆర్), భైర(సైఫ్ అలీఖాన్) తమ అనుచరులతో కలిసి ఎర్ర సముద్రంపై ప్రయాణం చేసే నౌకలపై ఆధారపడుతుంటారు.
సినిమాలో మలుపు ఇక్కడే..
ఇక సముద్రంపై ప్రయాణించే నౌకల ద్వారా మురుగ(మురళీశర్మ) గ్యాంగ్ అక్రమ ఆయుధాల్ని దిగుమతి చేస్తుంటుంది. ఈ ఆయుధాల వల్ల తమకే ముప్పు ఉంటదని గ్రహించిన దేవర.. ఆ పనుల్ని చేయకూదడని నిర్ణయించుకుని, చేపల వేటపై దృష్టి పెడుదామని తమ అనుచరులను ఆదేశిస్తాడు. కానీ భైరకు దేవర నిర్ణయం నచ్చదు. దీంతో ఇరువురి మధ్య అంతరుద్ధ్యం ఏర్పడుతుంది. అక్రమ ఆయుధాల రవాణాకు అడ్డుపడుతున్న దేవరను అడ్డు తొలగించి, సంద్రాన్ని శాసించాలని భైర నిర్ణయించుకుంటాడు. ఈ పరిణామాల నేపథ్యంలో దేవర మాత్రం అజ్ఞాతంలో ఉంటూ ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టేలా చేస్తుంటాడు. దేవర ప్రత్యర్థులను ఎన్ని తరాలు భయపెట్టించాడు..? దేవర అజ్ఞాతంలోనే ఎందుకు ఉన్నాడు..? దేవర కోసం అతని కొడుకు వర (ఎన్టీఆర్) ఏం చేశాడు? వరని ఇష్టపడిన తంగం (జాన్వీకపూర్) ఎవరు? వంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూస్తేనే థ్రిల్లింగ్‌గా ఉంటుంది.
ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి..
దేవర కోసం కొరటాల శివ ఒక సరికొత్త ప్రపంచాన్ని వెండి తెరపై ఆవిష్కరించారు. ఈ ప్రపంచం చుట్టుతా భావోద్వేగాలు, గాఢతతో కూడిన కథను చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. ఎన్టీఆర్ తన పాత్రకు వంద శాతం న్యాయం చేయగలిగాడు. ఇక సముద్రం నేపథ్యంలో సాగే ఈ సినిమా కథ.. ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇచ్చింది. బ్రిటిష్ కాలం నుంచి ఎర్ర సముద్రానికి, అక్కడి ప్రజలకు ఉన్న చరిత్ర, దానికి కాపలాగా ఉండే దేవర కథను సింగప్ప(ప్రకాశ్‌రాజ్)తో చెప్పిస్తూ కథను అద్భుతంగా తెరకెక్కించారు. ఒక్కమాటలో చెప్పాలంటే స్క్రీన్‌ప్లే అద్భుతం.
ఇక ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ ఎలివేషన్స్, సముద్రం బ్యాక్‌డ్రాప్ గొప్ప థియేట్రికల్ అనుభూతిని పంచుతుంది. దేవర, భైర ఆ రెండు పాత్రల్ని అత్యంత శక్తిమంతంగా తెరపై ఆవిష్కరించారు. ఇద్దరి మధ్య సాగే భీకర పోరాటం, సహా ఇతర సన్నివేశాలను అద్భుతంగా చూపించారు. ఫియర్ సాంగ్, యాక్షన్ సీన్స్, ఇంటర్వెల్ సీన్స్ మరో స్థాయిలో ఉన్నాయి. మొత్తంగా ఫస్ట్ హాఫ్‌లో ఎర్ర సముద్రం కథ, దేవర, భైరవ పాత్రలు, యాక్షన్ సీన్స్, సాంగ్స్ ఇలా అన్ని సూపర్‌గా ఉన్నాయి.
సెకండాఫ్‌లో వర, తంగం పాత్రల సందడి కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ కాస్త తక్కువే. క్లైమాక్స్‌లో వచ్చే మలుపు ఊహించిందే అయినా, దానికి కొనసాగింపుగా సాగే పోరాట ఘట్టాలు, సముద్రంలో దేవర పాత్రను చూపించిన తీరు బాగా ఆకట్టుకున్నాయి. ఫైనల్‌గా దేవర, భైర పాత్రల ముగింపు ఏమిటనేది రెండో భాగం కోసం దాచి పెట్టారు.
ఢీ అండే ఢీ అనేలా దేవర, భైర పాత్రలు..
దేవర, భైర పాత్రలు.. ఢీ అంటే ఢీ అనేలా కొనసాగాయి. దేవర, వర పాత్రల్లో ఎన్టీఆర్ తన నటనతో మెప్పించారు. దేవర పాత్రలో ఎన్టీఆర్ లుక్, ఎమోషన్స్, యాక్షన్ సీన్స్.. సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాయి. భైర పాత్రలో అలీఖాన్ గొప్పగా నటించి, తెలుగు ప్రేక్షకులను అలరించాడు. తంగం పాత్రలో జాన్వీ కపూర్ ఎంతో అందంగా కనిపించి టాలీవుడు ప్రేక్షకుల హృదయాలను దోచేసుకుంది. కొరటాల శివ మాటలు, కథా రచన, భావోద్వేగాలు బాగా ప్రభావం చూపించాయి. ‘’దేవర అడిగినాడంటే సెప్పినాడని, సెప్పినాడంటే’. ‘‘భయం పోవాలంటే దేవుడి కథ వినాల, భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథ వినాల’ ఇలా పలు సంభాషణలు’ ప్రేక్షకులతో థియేటర్లలో ఈలలు వేయించాయి. నిర్మాణం ఉన్నతంగా ఉంది.
pic.twitter.com/fd47BdlR28#Devara Review
FIRST HALF
Rating ⭐⭐⭐⭐4/5 !!
Good with some scenes of goosebumps 🔥#JrNTR is terrific & his entry & title card 💥#SaifAliKhan, @KalaiActor & others are good too ✌️
Visuals are decent 👍
BGM by @anirudhofficial 💥🔥
Interval 👌… pic.twitter.com/ddZE1e3KFO
— it’s cinema (@its__cinema) September 26, 2024