Monalisa | తెలుగు మూవీలో హీరోయిన్‌గా కుంభమేళా మోనాలిసా!

అదృష్టం ఎవరిని.. ఎప్పుడు వరిస్తుందో తెలియదు. కింది స్థాయిలో ఉన్నవాళ్లు ఒక్కసారిగా ఫేమస్ అయిపోతారు. మరీముఖ్యంగా ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని కొందరు ఒకేరోజు ఓవర్ నైట్ స్టార్స్ అవుతున్నారు. అందులో ఒకరు మోనాలిసా భోంస్లే..

విధాత, హైదరాబాద్ :

అదృష్టం ఎవరిని.. ఎప్పుడు వరిస్తుందో తెలియదు. కింది స్థాయిలో ఉన్నవాళ్లు ఒక్కసారిగా ఫేమస్ అయిపోతారు. మరీముఖ్యంగా ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని కొందరు ఒకేరోజు ఓవర్ నైట్ స్టార్స్ అవుతున్నారు. అందులో ఒకరు మోనాలిసా భోంస్లే.. ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో పూసలు, రుద్రాక్ష మాలలు అమ్ముతూ అందరి దృష్టిని ఆకర్షించింది. మధ్యప్రదేశ్ లోని ఖర్గోన్ జిల్లా మహేశ్వర్ కు చెందిన సాధారణ అమ్మాయి మోనాలిసా.. ఒక్కసారిగా సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిపోయింది. తరువాత ఆమేకు పలు సినిమాల్లో అవకాశాలు వచ్చాయనే వార్తలు కూడా అప్పట్లో వచ్చాయి.

ఇప్పుడు తాజాగా మోనాలిసా భోంస్లేకు టాలీవుడ్ లో అవకాశం లభించింది. ఓ తెలుగు సినిమాలో ఆమె హీరోయిన్ గా ఎంపికయిది. బుధవారం హైదరాబాద్ లో నిర్వహించిన ఆ మూవీ లాంచింగ్ ఈవెంట్ లో మోనాలిసా సందడి చేసింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. యువ నటుడు సాయి చరణ్ హీరోగా, శ్రీను కోటపాటి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న మూవీ టీం. అయితే, మోనాలిసాకు తెలుగు సినిమాలో హిరోయిన్ గా ఛాన్స్ రావడం పట్ల టాలివుడ్ అభిమానులు పలు విధాలుగా స్పందిస్తున్నారు. ఇప్పుడు ఈ వార్త సినిమా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.