Ustaad Bhagat Singh | విధాత: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Power Star Pawan Kalyan) హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’(Ustaad Bhagat Singh) సినిమా కోసం పవన్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ లో భాగంగా పవన్ కల్యాణ్ కు సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తయినట్లుగా దర్శకుడు హరీశ్ శంకర్ వెల్లడించారు. ఈ సినిమాలో పవన్‌కు సంబంధించిన షెడ్యూల్ పూర్తయినట్లు తెలుపుతూ ఓ ప్రత్యేక ఫొటో పంచుకున్నారు.‘‘మాటిస్తే నిలబెట్టుకోవడం, మాట మీదే నిలబడడం.. మీరు పక్కనుంటే కరెంట్ పాకినట్లే’’ అంటూ పవన్ తో దిగిన ఫొటోను దర్శకుడు పంచుకున్నారు. ఈ రోజును తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని దర్శకుడు హరీశ్ శంకర్(Harish Shankar) తెలిపారు. పవన్ ఎనర్జీ సినిమాకు మరింత పవర్‌ను ఇచ్చిందని…సినిమా పూర్తికి సపోర్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. హరీశ్ షేర్ చేసిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పవన్ కల్యాణ్ నటించిన ‘హరి హర వీరమల్లు’(Hari Hara Veera Mallu) సినిమా ఇటీవలే విడుదలై మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. ప్రస్తుతం పవన్ నటిస్తున్న ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. వాటి షూటింగ్స్ ను వేగంగా పూర్తి చేసే లక్ష్యంతో వరుసగా పవన్ షూటింగ్స్ కు హాజరవుతున్నారు. ఈ క్రమంలో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ మూవీకి సంబంధించి తన సన్నివేశాల షూటింగ్ ను పవన్ పూర్తి చేశారు. పవన్ సపోర్ట్ వల్లే ఈ షెడ్యూల్ త్వరగా పూర్తయినట్లు దర్శకుడు హరీశ్ తెలిపారు.
‘గబ్బర్‌సింగ్’ తర్వాత పవన్‌కల్యాణ్ – హరీశ్‌శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇందులో కూడా పవన్ కల్యాణ్ ను దర్శకుడు మరోసారి పలర్ ఫుల్ పోలీస్ పాత్రలో చూపిస్తున్నారు. పవన్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా నటిస్తున్నారు. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.