ఆటోను తప్పించబోయి.. కొండను ఢీ కొట్టిన ట్రక్కు.. డ్రైవర్ మృతి
విధాత:విశాఖ నుంచి బళ్లారి వెళుతున్న ట్రక్కు.. రోళ్లపెంట వద్ద ఆటోను తప్పించబోయి కొండను ఢీకొట్టింది.ట్రక్కులోని బరువైన ఇనుప ప్లేట్లు డ్రైవర్ క్యాబిన్లోకి దూసుకువచ్చాయి.ఈ ఘటనలో రాజస్థాన్‌కు చెందిన డ్రైవర్ విజయేందర్ సింగ్ మృతి చెందగా.. క్లీనర్ లగన్ యోగికి తీవ్ర గాయాలయ్యాయి.వారిని కర్నూలు ప్రభుత్వ ఆడుపత్రికి తరలించారు.