విధాత:పరకాలలో ఆత్మహత్య చేసుకున్న దంపతుల కేసులో నలుగురు వ్యక్తుల అరెస్ట్.తేదీ 29 7 2021 రోజున పరకాల లోని చర్చికి వచ్చి ఆత్మహత్య చేసుకున్న కేశవ స్వామి అతని భార్య సంధ్యారాణి కేసులో నిందితులైన పుల్ల బాబు 65 ధర్మసాగర్ సబ్ స్టేషన్ అవుట్సోర్సింగ్ ఆపరేటర్,గూగుల్ లోతు వాలు నాయక్ 51 సోమ్లా తండా తీగరాజుపల్లి,గాడి పెళ్లి వెంకటేష్ 28 కోమటిపల్లి, అంబాల నవీన్ 34 వల్లభాపురం మండల్ ఎల్కతుర్తి లను, ఈ నలుగురు విద్యుత్ ,ఇరిగేషన్ పంచాయతీరాజ్ ఇతర ప్రభుత్వ శాఖలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రజలను మోసగించి ,కేశవ స్వామి దగ్గర నుండి డబ్బులు వసూలు చేసి వాటిని సొంతానికి వాడుకొని మోసం చేసినందున వారిని అరెస్టు చేసి మెజిస్ట్రేట్ముందు హాజరు పరిచి రిమాండ్ కు తరలించారు.