గంజాయితో పట్టుబడిన నలుగురు యువకుల అరెస్ట్

గంజాయి సేవిస్తున్న నలుగురు యువకులను హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుండి పోలీసులు సుమారు ముప్పై వేల రూపాయల విలువగల రెండు కిలోల గంజాయితో పాటు రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం

  • Publish Date - April 21, 2024 / 05:34 PM IST

విధాత, వరంగల్ ప్రతినిధి: గంజాయి సేవిస్తున్న నలుగురు యువకులను హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుండి పోలీసులు సుమారు ముప్పై వేల రూపాయల విలువగల రెండు కిలోల గంజాయితో పాటు రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్ట్ కు సంబందించి హనుమకొండ ఏసీపీ దేవేందర్ వివరాలు తెలుపుతూ పద్మాక్షి కాలనీ, స్మశాన పరిసర ప్రాంతంలో కొద్ది మంది యువకులు ప్రభుత్వ నిషేధిత గంజాయిని సేవిస్తున్నట్లుగా హనుమకొండ పోలీసులకు సమాచారం రావడంతో ఎస్. ఐ శ్రీనివాస్ తన సిబ్బందితో వెళ్ళి గంజాయి సేవిస్తున్న యువకులను అదుపులోని తీసుకోని పరిసరాలను తనిఖీ చేయగా పోలీసులకు రెండు కిలోల గంజాయి లభ్యమైంది. పట్టుబడిన యువకులను పోలీసులు విచారణ చేయగా 1) జంగం వంశీకృష్ణ వయస్సు:23, పెంచికలపేట, మండలం: ఆత్మకూర్, జిల్లా: వరంగల్, ప్రస్తుతం నివాసం వరంగల్ శివనగర్. 2) ఆరూరి వంశీ,వయస్సు.22, వంగాలపల్లి గ్రామం, ఛిల్పూర్ మండలం, జనగామ జిల్లా. 3) ఐత శివ, వయస్సు 20, ఆనందనగర్ కాలనీ, పద్మాక్షి కాలనీ,హన్మకొండ. 4) బుగ్గ నవీన్ S/o రాజేందర్, వయస్సు23, రమేష్ నగర్, గోదావరిఖని, పెద్దపల్లి జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. పట్టుబడిన యువకులపై నమోదు చేసి కోర్టు ముందు హాజర్ పరిచినట్లు ఏసీపీ తెలియజేశారు. గంజాయిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన హనుమకొండ ఇన్స్ స్పెక్టర్ సతీష్, ఎస్. ఐలు శ్రీనివాస్, పరుశురాములు, హెడ్ కానిస్టేబుళ్ళు రవీందర్ రెడ్డి, అశోక్, కానిస్టేబుల్ కిరణ్ ఏసీపీ అభినందించారు.

Latest News