బెంగళూరు: కర్ణాటకలో దారుణం చోటుచేసుకున్నది. కలబుర్గి జిల్లా ఆళంద తాలుకాలోని మాదన హిప్పర గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. స్థానికంగా నివాసం ఉంటున్న శ్రీమంత, సృష్టి భార్యభర్తలు. ఇద్దరిదీ అన్యోన్య జీవితం. శ్రీమంత పొలం పనులు చూసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శ్రీమంత, సృష్టి పెళ్లి అయిన దగ్గరి నుంచి అన్యోన్యంగానే ఉండేవారు.
కొంతకాలం క్రితం సృష్టికి ఖాజప్ప అనే వ్యక్తితో పరిచయం కలిగింది. అది అక్రమ సంబంధానికి దారితీసింది. శ్రీమంత పొలానికి వెళ్లినప్పుడల్లా వారిద్దరూ కలుసుకునేవారు. ఇదే క్రమంలో గురువారం శ్రీమంత వేరే పనిమీద సమీ పట్టణానికి వెళ్లాడు. భర్త లేడన్న విషయం తెలిసి.. సృష్టిని కలవడానికి ఖాజప్ప వచ్చాడు.
కాసేపటికి శ్రీమంత ఇంటికి వచ్చేశాడు. ఈ సమయంలో ఖాజప్ప తన భార్య సృష్టితో కలిసి ఉండటంతో కోపంతో రగిలిపోయాడు. సృష్టి, ఆమె ప్రియుడు ఖాజప్పను కొడవలితో నరికేశాడు. తీవ్రంగా గాయపడిన ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. ఈ జంటల హత్యల అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన శ్రీమంత.. పోలీసులకు విషయం చెప్పి లొంగిపోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవికూడా చదవండి..
Bull Rides Activa | అన్ బిలివబుల్.. యాక్టివాపై దూసుకెళ్లిన ఎద్దు.. వీడియో
One Rupee Marriage | వధువే వరకట్నం.. ఒక్క రూపాయితో పెళ్లి చేసుకున్న యువ న్యాయవాది