Site icon vidhaatha

Prajwal Revanna | ప్రజ్వల్‌.. ఖైదీ నంబర్‌ 15528.. జీతం ఎంతో తెలుసా?

Prajwal Revanna | రేప్‌ కేసులో మరణించే వరకూ జైల్లోనే ఉండబోతున్న జేడీఎస్‌ మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ జైలు జీవితం మొదలైంది. మొన్నటి వరకూ అండర్‌ ట్రయల్‌ ఖైదీగా ఉన్న ప్రజ్వల్‌కు శిక్ష ఖరారైన నేపథ్యంలో బెంగళూరులోని పరప్పణ అగ్రహార సెంట్రల్‌ జైలు అధికారులు.. తెల్ల యూనిఫాం ఇచ్చారు. 15528 నంబరును కేటాయించారు. అతడిని జైల్లోని నేరస్తుల బేరక్స్‌కు తరలించారు. ఈ కేసు విచారణ ప్రక్రియ అసాధారణంగా 14నెలల్లోనే ముగిసి.. తీర్పు వెలువడటం విశేషం.

మొన్నటి వరకూ రాజభోగాలు అనుభవించిన ప్రజ్వల్‌.. ఇప్పుడు జైల్లోని అనేక మంది ఖైదీల్లో ఒకడు. జైలు నిబంధనల ప్రకారం రోజుకు ఎనిమిది గంటలపాటు తప్పనిసరిగా ఏదో ఒక పని చేయాల్సి ఉంటుంది. ప్రజ్వల్‌ను అందరు సాధారణ ఖైదీల తరహాలోనే చూస్తామని జైలు అధికారులు చెబుతున్నారు. అతడికి అందరు ఖైదీలకు అప్పగించినట్టే కొన్ని విధులు అప్పగిస్తారు. జైలు బేకరీ, గార్డెనింగ్‌, పాడి, కూరగాయల తోటలో పని, కార్పెంటరీ, చేతి వృత్తులు వంటి ఏదో ఒక క్యాటగిరీని ప్రజ్వల్‌ ఎంచుకోవాలి. అందుకు గాను అతడిని నెలకు 524 రూపాయల వేతనం ఇస్తారు. ఇది అన్‌స్కిల్డ్‌ లేబర్‌కు ఇచ్చే మొత్తం. ఇచ్చిన పనిలో తన సామర్థ్యం నిరూపించుకుంటే జీతం పెంచడంతోపాటు.. సెమీ స్కిల్డ్‌ లేదా స్కిల్డ్‌ వర్కర్‌గా ప్రమోట్‌ చేసి.. జీతం పెంచుతారు.

Exit mobile version