తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి అంటూ రూ.61లక్షలు టోకరా..!

టెక్నాలజీ రోజు రోజుకు కొంత పుంతలు తొక్కుతున్నది. అదే సమయంలో సైబర్‌ నేరగాళ్లు సైతం అదే టెక్నాలజీతో బురిడీ కొట్టిస్తూ లక్షల్లో సొత్తూ లూటీ చేస్తున్నారు

  • Publish Date - December 5, 2023 / 06:04 AM IST

విధాత‌: టెక్నాలజీ రోజు రోజుకు కొంత పుంతలు తొక్కుతున్నది. అదే సమయంలో సైబర్‌ నేరగాళ్లు సైతం అదే టెక్నాలజీతో బురిడీ కొట్టిస్తూ లక్షల్లో సొత్తూ లూటీ చేస్తున్నారు. నిత్యం ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరూ సైబర్‌ నేరగాళ్ల బారినపడుతున్నారు. పోలీసులు ఎంత అవగాహన కల్పించినా సైతం సైబర్‌ కేటగాళ్లు వలకు చిక్కుతున్నారు. ఇందులో టెకీలు సైతం ఉండడం గమనార్హం. తాజాగా బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఉల్లాస్‌ను పార్ట్‌టైం జాబ్‌ పేరుతో నేరగాళ్లు బోల్తా కొట్టించి రూ.61లక్షల సొత్తును నష్టపోయాడు.


ఉల్లాస్‌ను సైబర్‌ నేరగాళ్లు పార్ట్‌టైం జాబ్‌లో భాగంగా వెబ్‌సైట్‌లను సమీక్షించడం.. యూఆర్‌ఎల్‌పై క్లిక్‌ చేయడంపై చేయడం పనులు ఉన్నాయంటూ నేరగాళ్లు మభ్యపెట్టారు. మొదటలో రూ.10వేల పెట్టుబడి పెట్టి రూ.20లక్షలకు మార్చాడు. ఆ నగదును విత్‌డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా.. జమ కాలేదు. సైబర్‌ నేరగాళ్లు రంగంలోకి దిగి రూ.20లక్షలను విత్‌డ్రా చేసుకునేందుకు రూ.10లక్షలు చెల్లించాల్సి ఉంటుందని నమ్మించారు.


దీంతో ఉల్లాస్‌ ఆ డబ్బును స్నేహితుల వద్ద అప్పుగా తీసుకున్నాడు. వారికి చెల్లించాడు. ఇలానే సైబర్‌ నేరగాళ్లు మాయమాటలు చెప్పి రూ.61.5లక్షల వరకు తమ ఖాతాలకు మళ్లించారు. చివరకు తాను మోసపోయానని గ్రహించి లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దర్యాప్తు ప్రారంభించింది.


అయితే, నేరస్థులు వీపీఎన్‌ను ఉపయోగించారని, దాంతో వారిని కనిపెట్టడం సవాల్‌గా మారిందని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. సైబర్‌ నేరగాల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభాలు పొందవచ్చంటూ వచ్చే ప్రకటనలను నమ్మొద్దని సూచించారు. ఇటీవల కాలంలో సైబర్‌ నేరాలు పెరిగాయని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Latest News