Prajwal Revanna Gets Life Imprisonment | మాజీ ప్రధాని మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు

బలాత్కార కేసులో జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు విధిస్తూ కర్ణాటక కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. మాజీ ప్రధాని దేవేగౌడ మనవడైన ఆయనపై సిట్ దర్యాప్తులో ఆరోపణలు రుజువైన నేపథ్యంలో ఈ తీర్పు వెలువడింది.

prajwal-revanna-life-imprisonment-rape-case-court-verdict-karnataka

ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు ఐటం చేస్తున్నా

Prajwal Revanna Gets Life Imprisonment | జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు విధిస్తూ కర్ణాటక కోర్టు శనివారం తీర్పు వెల్లడించింది. బాధితురాలికి రూ. 7 లక్షలు చెల్లించాలని కూడా ఆదేశించింది. ప్రజ్వల్ రేవణ్ణ మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు. ప్రజ్వల్ రేవణ్ణపై వచ్చిన ఆరోపణలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం 2024 ఏప్రిల్ 27న సిట్ ఏర్పాటు చేసింది. ఏప్రిల్ 28,2024 న ఈ కేసు విచారణను సిట్ కు బదిలీ చేశారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు తర్వాత మరికొందరు కూడా ఆయనపై ఫిర్యాదు చేశారు.

2024 మే 2న ప్రజ్వల్ రేవణ్ణపై రేప్ కేసు నమోదైంది. అదే సమయంలో ఆయనపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. 2024 మే 4న అదృశ్యమైన మహిళను సిట్ అధికారులు రక్షించారు. 2024 మే 30న విదేశాల నుంచి రేవణ్ణ బెంగుళూరుకు తిరిగి వచ్చారు.2024 మే 31న రేవణ్ణను పోలీసులు అరెస్ట్ చేశారు.1632 పేజీలతో ప్రజ్వల్ పై సిట్ చార్జీషీట్ దాఖలు చేసింది. 113 మంది సాక్షులను కూడా విచారించినట్టు చార్జీషీట్ లో సిట్ తెలిపింది. 2024 అక్టోబర్ 21న రేవణ్ణ బెయిల్ ను కర్ణాటక హైకోర్టు తోసిపుచ్చింది.2024 నవంబర్ 2న బాధితురాలిని ప్రజ్వల్ రేప్ చేసినట్టు పరీక్షల్లో నిర్ధారణ అయింది. హైకోర్టు బెయిల్ పిటిషన్ కొట్టివేయడంతో సుప్రీంకోర్టులో కూడా ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. 2024 నవంబర్ 11న ఈ బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ ఏడాది మే 1న కొత్త అడ్వకేట్ ను నియమించుకొనేందుకు సమయం కావాలని రేవణ్ణ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసిన కర్ణాటక హైకోర్టు. ఈ ఏడాది మే 2 నుంచి స్పెషల్ కోర్టులో ట్రయల్ ప్రారంభమైంది. అందరి వాదనలు విన్న తర్వాత తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. ఈ ఏడాది ఆగస్టు 1న కోర్టు రేవణ్ణ దోషిగా నిర్ధారించింది. ఇవాళ ఆయనకు జీవిత ఖైదు విధించింది.

బెంగుళూరులోని కేఆర్ నగర్ కు చెందిన బాధితురాలు 2024 ఏప్రిల్ 28న హొళెనరసీపుర పోలీస్ స్టేషన్ లో ప్రజ్వల్ రేవణ్ణపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫాంహౌస్ లో తనపై రేవణ్ణ అత్యాచారం చేశారని బాధితురాలు ఆ ఫిర్యాదులో తెలిపింది. ఈ కేసులో ఆయన 14 నెలలు జైల్లో ఉన్నారు. ఈ కేసులో అందరి వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి సంతోశ్ గజానన హెగ్డే రేవణ్ణను దోషిగా తేల్చారు. ఇవాళ శిక్ష ఖరారు చేశారు.

భావోద్వేగానికి గురైన రేవణ్ణ

ఈ కేసులో ఆగస్టు 1న కోర్టు దోషిగా ఖరారు చేసిన సమయంలో రేవణ్ణ భావోద్వేగానికి గురయ్యారు. ఇవాళ శిక్ష ఖరారు చేసిన సమయంలో కూడా ఆయన భావోద్వేగానికి గురయ్యారని చెబుతున్నారు. ఉద్దేశపూర్వకంగానే మహిళ తనపై ఫిర్యాదు చేసిందని ఆయన ఆరోపించారు. ఎన్నికలకు రోజుల ముందు ఆమె తనపై ఫిర్యాదు చేశారని ఆయన ఆరోపించారు.