Site icon vidhaatha

Bengaluru Rave Party | రేవ్ పార్టీ ఇచ్చిన లంకపల్లి వాసు…ఎవరీ వాసు? బెట్టింగ్ బాసు అసలు చరిత్ర

S

లంకపల్లి వాసు.. సొంత ఊరు విజయవాడ. బాల్యం అంతా బ్రహ్మంగారి వీధిలో భారంగా గడిచింది. తండ్రి ఏదో చిన్న పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుఉండేవాడు. అతడు చనిపోయాక తల్లి అదే వీధిలో టిఫిన్ బండి నడిపేది. ఒక అక్క, ఇద్దరు అన్నయ్యలు ఉన్న వాసుకు చిన్నప్పటి నుండీ క్రికెట్(Cricket fan) అంటే పిచ్చి. ఆటలో రాణించాలని తెగ తాపత్రయపడేవాడు గానీ వీలు కాలేదు. చదువు పెద్దగా అబ్బకపోయినా చెడు స్నేహాలు మాత్రం బాగా అల్లుకున్నాయి. దాంతో సరదాగా బెట్టింగ్ కాసేవాడు. ఆటను సునిశితంగా గమనించే వాసు తన బెట్లన్నీ దాదాపుగా నెగ్గేవాడు. దాంతో బాగా పాపులర్ అయ్యాడు. అతని ఫాలోయింగ్ కూడా పెరిగింది. దీంతో కొత్త ఐడియా వచ్చిన వాసు తానే బెట్టింగ్ దందా ఎందుకు షురూ చేయకూడదని తనే బుకీ(Bookie) గా మారాడు. అంతే.. అనతికాలంలోనే బెట్టింగ్ కింగ్గా తయారయ్యాడు.

తన సామ్రాజ్యాన్ని వాసు, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలకు కూడా విస్తరించాడు. సినిమా రాజధానులైన విజయవాడ, మద్రాసులలో విస్తృత పరిచయాలు ఏర్పడ్డాయి. వందల సంఖ్యలో ఉద్యోగులను నియమించుకున్నాడు. ఒక్క విజయవాడలోనే 140 మంది ఉన్నారని సమాచారం. వారందరూ కూడా ఇదే బెట్టింగ్ దందాలోనే నిమగ్నమయ్యేవారు. ఎప్పుడైనా, ఎక్కడైనా రైడ్ జరిగి తనవాళ్లు పట్టుబడితే ఒక్క ఫోన్కాల్తో విడిపించుకునే స్థాయికి చేరారు. తన మకాం ఇక బెంగళూరుకు మార్చాడు. భార్యాపిల్లలు విజయవాడలోనే ఉంటారు(Settled in Bengaluru). ఇరుగుపొరుగుతో తనకు విదేశీవ్యాపారాలున్నాయని నమ్మించాడు. నెలకు 3 లేదా 4 సార్లు విజయవాడకు రావడం ఈ విషయంతో తనకు కలిసివచ్చింది. సినిమా పరిశ్రమ(Cinema Industry)తో ఏర్పడిన అనుబంధం కూడా బాగా విస్తరించింది. చాలా తొందరలోనే వందల కోట్లకు అధిపతి అయ్యాడు. నాలుగైదు అత్యంత ఖరీదైన కార్లకు ఓనర్. రెండు మూడు పబ్లు కూడా ఉన్నాయట. కాలు కదిపితే లగ్జరీ కారు, బయటికెళ్తే ఫ్లయిట్..ఇది దొర గారి రాజసం.

వాసు అన్న చిన్నాచితకా కారణాలకు కూడా భారీ పార్టీలిస్తూండేవాడు. అవి సాధారణంగా విజయవాడలోనే ఎక్కువ. అప్పుడప్పుడూ హైదరాబాద్లో. వాసన్న పార్టీ అంటే విజయవాడలో హడావుడే. చోటామోటా రాజకీయనాయకుల నుండి టీవి, సినీ తారల వరకు చాలామంది వచ్చేవారు. ఈసారి పుట్టినరోజు వేడుకలు అత్యంత “ఘనం”గా నిర్వహిద్దామని నిర్ణయించుకున్నాడు. దానికి రేవ్ పార్టీనే కరెక్ట్ అనుకున్నాడు. ఇంకేం… అనుకున్నదే తడవు అన్ని ఏర్పాట్లు చకచకా పూర్తయ్యాయి. పార్టీలో మందూ, విందూ, పొందులో పాటు మత్తు కూడా తోడయింది. ఇక అడ్డా.. అడ్డా ఎక్కడంటే.. ఎక్కడ అనుకుని చివరికి బెంగళూరు అయితేనే సేఫ్ అనకున్నారు. ముందుగా అనుకున్న హైదరాబాద్ను క్యాన్సిల్ చేసారు. ఈమధ్య హైదరాబాద్ పోలీసులు డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపడంతో పాటు అన్ని శివారు ఫాంహౌస్లపై నిఘా పెంచారు. అందుకని పార్టీ కాస్తా బెంగళూరుకి షిఫ్ట్ అయింది. పార్టీ ఊపందుకున్నాక, డీజే సౌండ్లు మోతెక్కిపోవడంతో పొరుగిళ్లవారు పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు. దాంతో కథ అంతా బయటకొచ్చింది. హేమ డ్రామా, ఆషి రెడ్డి అమాయక నటన అన్నీ బూటకమని తేలాయి. 118 మంది డ్రగ్స్ సేవించినట్లు పరీక్షల్లో రుజువయింది. అందులో ఈ ఇద్దరు నటీమణులు కూడా ఉన్నారు.

ఈ కథ ఇక్కడితో అంతం కాలేదు. ఆరంభం అయింది. బెట్టింగ్ వాసు చిన్నోడేంకాదని పోలీసులకు తెలిసిపోయింది. బెంగళూరు పోలీసులు తన ఊరి పేరు సర్వనాశనం చేసారని మహోగ్రరూపంతో ఉన్నారు. వాసును ఏ1గా నిర్ణయించిన పోలీసులు, డ్రగ్ పెడ్లర్స్, సప్లయర్లపై దృష్టి సారించారు. ఇది ఇంకా ఎక్కడెక్కడికో పాకుతోంది. సినిమా ఇండస్ట్రీ చుట్లూ అల్లుకుంటోంది.

బెట్టింగ్ వాసు జీవిత చరిత్ర అచ్చం సినిమాలాగే ఉంది కదా.. చూద్దాం. రేపెవరైనా బెట్టింగ్ బాస్ పేరుతో సినిమా తీసినా తీయొచ్చు.

Readmore

Bangalore Rave Party | రేవ్ పార్టీలో నటి హేమ…బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే..?

Karate Kalyani | టాలీవుడ్ పరువు తీసిన హేమ: కరాటే కల్యాణీ

Bangalore Rave Party | బెంగుళూర్ రేవ్ పార్టీ కేసు ఎప్పుగూడ పీఎస్‌కు బదిలీ

Srikanth| ఏంటి… హీరో శ్రీకాంత్ కూడా రేవ్ పార్టీలో దొరికాడా..!

Hema| బెంగ‌ళూరు రేవ్ పార్టీలో హేమ‌.. ఫోటో విడుద‌ల చేసిన బెంగ‌ళూరు పోలీసులు

“రేవ్​ పార్టీలో ఉన్నది తెలుగు నటి హేమనే”

Bangalore Rave Party | బెంగుళూర్‌ రేవ్‌ పార్టీలో 86 మందికి డ్రగ్‌ టెస్టులో పాజిటీవ్‌.. వారికి నోటీస్‌లు

Exit mobile version