Site icon vidhaatha

revenge killing । అంగన్‌వాడీ చిన్నారిని చంపిన మహిళ.. కారణం ఇదే!

revenge killing । తమిళనాడులోని తిరునెల్వేలి (Tirunelveli) జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. ప్రతీకారం (revenge killing) తీర్చుకునేందుకు 40 ఏళ్ల మహిళ ఒక అంగన్‌వాడీ (angwanwadi) బాలుడిని హత్య చేసిన ఘటన వెలుగు చూసింది. నిందితురాలి ఇంట్లో వాషింగ్‌మెషీన్‌(washing machine)లో బాలుడి మృతదేహాన్ని వెలికితీశారు. నిందితురాలిని రాధాపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అతుకురిచి గ్రామానికి చెందిన తంగమ్మళ్‌గా గుర్తించారు. నిందితురాలు తన కుమారుడు చనిపోయిన తర్వాత మానసికంగా ఇబ్బంది (mental illness) పడుతున్నదని అనుమానిస్తున్నారు.

కుమారుడు సంజయ్‌ కనిపించని విషయాన్ని సోమవారం ఉదయం విఘ్నేశ్‌ భార్య రమ్య గుర్తించింది. అంగన్‌వాడీ(anganwadi)కి తీసుకెళ్లేందుకు సిద్ధపడుతున్న సమయంలో బాలుడు అదృశ్యమయ్యాడు. చుట్టుపక్కల వెతికినా కనిపించలేదు. అదృశ్యం కావడానికి ముందు బాలుడు ఇంటిముందు ఆడుకుంటున్నాడు. ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయింది. వెంటనే రాధాపురం పోలీస్‌ స్టేషన్‌లో (Radhapuram police) కంప్లైంట్‌ చేశారు. తమ బాలుడు అదృశ్యం (missing) కావడం వెనుక తంగమ్మళ్‌ హస్తం ఉండొచ్చన్న అనుమానాన్ని పోలీసుల వద్ద తల్లిదండ్రులు వ్యక్తం చేశారు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు.. నిందితురాలి ఇంటిలో తనిఖీలు నిర్వహించారు. అక్కడ బాలుడు నిర్జీవంగా (lifeless body) కనిపించాడు. బాలుడి శవం కనిపించకుండా దానిని ఒక వస్త్రంలో చుట్టి.. వాషింగ్‌ మెషీన్‌లో తంగమ్మళ్‌ దాచిపెట్టింది.

గతంలో ఒక రోడ్డు ప్రమాదంలో (road accident) తంగమ్మళ్‌ కుమారుడు చనిపోయాడు. అయితే.. పొరుగున్న ఉన్న విఘ్నేశ్‌ అనే వ్యక్తే ఈ ప్రమాదానికి కారణమని తంగమ్మళ్‌ అప్పట్లో ఆరోపించిందని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొన్నది. అప్పటి నుంచి ఆ కుటుంబంపై తంగమ్మళ్‌ కక్ష (grudge) పెంచుకున్నదని చెబుతున్నారు. విఘ్నేశ్‌ కుటుంబంపై తంగమ్మళ్‌కు కక్ష ఉన్నదని అర్థమైనా.. ఈ కోణంలోనే విఘ్నేశ్‌ కుమారుడు సంజయ్‌ను చంపిందా?  అన్న విషయంలో పోలీసులు ఇంకా ఒక నిర్ధారణకు రాలేదని సమాచారం. ఆమెను పోలీసులు  అరెస్టు చేసి,  దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్య కేసులో మరింత మంది భాగస్వామ్యం ఉండే అవకాశం లేకపోలేదని పోలీసులు అనుమానిస్తున్నారు.

Exit mobile version