Solar eclipse | చాలా కాలం త‌ర్వాత పితృప‌క్షంలో సూర్య‌గ్ర‌హ‌ణం.. ఈ నాలుగు రాశుల వారికి క‌న‌క వ‌ర్ష‌మే..!

Solar eclipse | ఈ నెల 21న రాబోతున్న సూర్య‌గ్ర‌హ‌ణానికి( Solar eclipse ) చాలా ప్ర‌త్యేక‌త ఉంది. చాలా కాలం త‌ర్వాత పితృప‌క్షం( pitru paksha )లో సూర్య‌గ్ర‌హ‌ణం ఏర్ప‌డుతుంది. ఇలా మ‌హాల‌య అమావాస్య( Mahalaya Amavasya ) రోజున సూర్య‌గ్ర‌హ‌ణం ఏర్ప‌డ‌డం కార‌ణంగా ఈ నాలుగు రాశుల( Zodiac Signs ) వారికి క‌న‌క వ‌ర్షం కురియ‌నుంది.

  • Publish Date - September 19, 2025 / 07:36 AM IST

Solar eclipse | సెప్టెంబ‌ర్ 21వ తేదీన భాద్ర‌ప‌ద అమావాస్య( Amavasya ) రోజున సూర్య‌గ్ర‌హ‌ణం( Solar Eclipse ) సంభ‌వించ‌నుంది. మ‌హాల‌య అమావాస్య( Mahalaya Amavasya ) రోజున ఏర్ప‌డే ఈ గ్ర‌హం మ‌రింత ప్ర‌త్యేక‌మైన‌దిగా పండితులు భావిస్తున్నారు. ఈ సూర్య‌గ్ర‌హ‌ణం 21న రాత్రి 11 గంట‌ల‌కు ప్రారంభ‌మై సోమ‌వారం తెల్ల‌వారుజామున 3.24 గంట‌ల‌కు ముగియ‌నుంది. ఈ గ్ర‌హ‌ణం మ‌న దేశంలో క‌నిపించ‌న‌ప్ప‌టికీ, జ్యోతిష్య శాస్త్రం ప్ర‌కారం ప‌లువురిపై ప్ర‌భావం చూపిస్తుంది. మ‌రి ముఖ్యంగా ఈ నాలుగు రాశుల( Zodiac Signs ) వారి ద‌శ మార‌డంతో పాటు వారి ఇండ్ల‌లో క‌న‌క వ‌ర్షం కురియ‌నుంది. మ‌రి ఆ నాలుగు రాశులేంటో తెలుసుకుందాం.

వృష‌భ రాశి( Taurus )

21న ఏర్ప‌డే సూర్య గ్ర‌హ‌ణం కార‌ణంగా.. వృష‌భ రాశి వారికి ఆర్థిక ప్ర‌యోజ‌నాలు మెండుగా ఉన్నాయి. ఊహించ‌ని విధంగా డ‌బ్బులు స‌మ‌కూరుతాయి. స్టాక్ మార్కెట్ పెట్టుబ‌డులు, న‌గ‌దు లావాదేవీల‌లో లాభాలు ఉన్నాయి. ఇక పెండింగ్ ప‌నుల‌న్నీ పూర్త‌వుతాయి. ఆత్మ‌విశ్వాసం పెర‌గ‌డంతో పాటు చేప‌ట్టిన ప్ర‌తి ప‌నిలో విజ‌యం సాధిస్తారు. ఈ రాశి వారు సూర్యగ్రహణం తర్వాత గోధుమలను దానం చేయడం వల్ల అదృష్టం మ‌రింత పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో అడ్డంకులు తొలగిపోతాయి.

మిథున రాశి( Gemini )

మిథున రాశి వారికి కూడా మంచి కెరీర్ ఉండ‌బోతుంది. ప్ర‌తి అడుగు విజ‌యానికి కార‌ణ‌మ‌వుతుంది. గ‌తంలో చేప‌ట్టిన ప్రాజెక్టులో పెట్టుబ‌డి ఉంటే.. ఇప్పుడు దాని ప్ర‌యోజ‌నాలు ల‌భిస్తాయి. మాట్లాడే నైపుణ్యం, వ్యాపార పరిజ్ఞానం, నిర్వహణ నైపుణ్యాల కారణంగా వీరి కెరీర్ అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో చిన్న సమస్యలు తలెత్తవచ్చు. అయితే అవన్నీ మంచులాగా మాయమవుతాయి. శ్ర‌మ‌కు త‌గ్గ ఫ‌లితం పొందుతారు. సూర్యగ్రహణం తర్వాత పేదలకు రాగి వస్తువులను దానం చేయడం వలన జీవితంలో స్థిరత్వాన్ని పెంచుతుంది.

మకర రాశి( Capricorn )

మ‌క‌ర రాశి వారికి ఈ సూర్యగ్రహణం మ‌న‌శ్శాంతిని ఇస్తుంది. కెరీర్, వ్యాపార రంగంలో ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహిస్తారు. రాజకీయాలు, సామాజిక రంగాలతో సంబంధం ఉన్న వారి పట్ల గౌరవం పెరుగుతుంది. తోబుట్టువులతో సంబంధం బలపడుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. పూర్వీకుల ఆస్తి లభించే అవకాశం ఉంది. సూర్యగ్రహణం తర్వాత నల్ల నువ్వులు లేదా మినప పప్పు దానం చేయడం వల్ల విజయానికి మార్గం సుగమం అవుతుంది.

కుంభ రాశి( Aquarius )

ఈ సూర్య గ్ర‌హ‌ణం కుంభ రాశి వారికి అనేక ఊహించని ప్రయోజనాలను తెస్తుంది. ఇంతకు ముందు ఏదైనా డబ్బు సంబంధిత విషయాలలో పెట్టుబడి పెట్టి ఉంటే.. ఆ పెట్టుబడుల నుంచి లాభాలు అందుకుంటారు. బీమా, బోనస్‌, వారసత్వంగా వచ్చిన ఆస్తి నుంచి కూడా డబ్బు పొందే అవకాశం ఉంది. పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే.. ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. సూర్యగ్రహణం తర్వాత బియ్యం దానం చేయడం వలన ఒత్తిడి నుంచి ఉపశమనం ఇస్తుంది.