సూర్యాస్త‌మ‌యం త‌ర్వాత ఈ ప‌నులు చేస్తున్నారా..? అయితే ఆర్థిక క‌ష్టాలు కొని తెచ్చుకున్న‌ట్టే..!

  • Publish Date - April 13, 2024 / 06:34 AM IST

ప్ర‌తి ఒక్క‌రూ జీవితంలో సంతోషంగా ఉండ‌లేరు. క‌ష్ట‌సుఖాల‌తో జీవితాన్ని కొన‌సాగిస్తుంటారు. చాలా మందిని ఆర్థిక క‌ష్టాలు వెంటాడుతుంటాయి. ఈ ఆర్థిక క‌ష్టాల‌ను అధిగ‌మించేందుకు ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. అయితే వాస్తు శాస్త్రాన్ని పాటిస్తే ఆర్థిక క‌ష్టాల‌కు చెక్ పెట్టొచ్చ‌ని వాస్తు పండితులు చెబుతున్నారు. ఆర్థిక స‌మ‌స్య‌ల నుంచి గట్టెక్కాలంటే సూర్యాస్తమయం తర్వాత ఈ ప‌నులు చేయకూడని సూచిస్తున్నారు. సాయంత్రం వేళ చేయ‌కూడ‌ని పనులు చేస్తే.. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అంటున్నారు. మ‌రి సూర్యాస్త‌మ‌యం త‌ర్వాత ఏ ప‌నులు చేయ‌కూడ‌దో తెలుసుకుందాం..

  • సూర్యాస్త‌మ‌యం త‌ర్వాత పాలు, ప‌సుపు, ఉప్పు, చ‌క్కెర‌, పుల్ల‌ని ప‌దార్థాలు దానం చేయ‌కూడ‌దు. వీటిని దానం చేయ‌డం వ‌ల్ల ఆర్థిక స‌మ‌స్య‌లు వ‌స్తాయి. జీవితంలో కూడా స్థిర‌ప‌డ‌లేర‌ని వాస్తు పండితులు చెబుతున్నారు.
  • ఇక రాత్రి స‌మ‌యాల్లో సింక్‌లో అస‌లు ఎంగిలి గిన్నెలు ఉంచ‌కూడ‌దు. భోజ‌నం చేసిన వెంట‌నే గిన్నెలు క‌డ‌గాలి. అలానే ఎంగిలి గిన్నెల‌ను సింక్‌లో ఉంచితే పేద‌రికం, అప్పుల‌పాలు కావాల్సి వ‌స్తుంద‌ని వాస్తు పండితులు హెచ్చ‌రిస్తున్నారు.
  • సూర్యుడు అస్త‌మించిన త‌ర్వాత గోళ్లు, జుట్టు క‌త్తిరించ‌కూడ‌దు. ఒక‌వేళ ఈ రెండు ప‌నులు చేస్తే ల‌క్ష్మీదేవి ఆగ్ర‌హానికి గురికావాల్సి వ‌స్తుంది. ద‌రిద్రం తాండ‌విస్తుంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.
  • సూర్యాస్త‌మ‌యం త‌ర్వాత ఇళ్లు ఊడిస్తే లక్ష్మీదేవి ఇళ్లు వదిలి పోతుందని.. కుటుంబ సభ్యులు అనారోగ్యం, దుఖం, అశాంతి సమస్యలు ఎదుర్కొంటారని అంటున్నారు. సూర్యస్తమయం లోపే ఇళ్లు శుభ్రం​ చేసుకోవాలని సూచిస్తున్నారు.

Latest News