Vastu Tips | బెడ్ కింద డ‌బ్బులు, బంగారం దాచుతున్నారా..? అయితే ద‌రిద్రం వెంటాడిన‌ట్టే..!

Vastu Tips | ప్ర‌తి ఒక్క‌రూ ఎంతోకొంతో.. న‌గ‌దు( Money ), బంగారం( Gold ) కూడ‌బెట్టుకుంటారు. ఇలా సంపాదించిన వారు.. డ‌బ్బు, బంగారాన్ని కంటికి రెప్ప‌లా కాపాడుకుంటారు. ఎల్ల‌ప్పుడూ త‌మ‌వ‌ద్ద ఉండాల‌నే ఆలోచ‌న‌తో.. వాటిని ద‌గ్గ‌ర్లోనే ఉంచుకుంటారు. కానీ అలా చేయ‌డం స‌రికాదు అంటున్నారు జ్యోతిష్య పండితులు.

Vastu Tips | ఒక స‌గ‌టు మ‌నిషి కూడా త‌న కుటుంబాన్ని గొప్ప‌గా పోషించుకునేందుకు క‌ష్ట‌ప‌డుతుంటాడు. వ‌చ్చే ఆదాయంలో కొంత దాచి.. బంగారం( Gold ), వెండి( Silver ) ఆభ‌ర‌ణాల‌ను కొనుగోలు చేస్తుంటారు. ఎప్పుడు ఏ అవ‌స‌రం వ‌స్తుందోన‌ని కొంత న‌గ‌దు( Money ) కూడా దాచి పెడుతుంటారు. ఇలా కూడ‌బెట్టిన న‌గ‌దుతో పాటు బంగారు ఆభ‌ర‌ణాల‌ను బీరువాలో కాకుండా.. త‌మ మంచం బెడ్( Bed ) కింద దాచి పెడుతుంటారు. ఇలా దాచిపెట్ట‌డం స‌రికాద‌ని జ్యోతిష్య పండితులు హెచ్చ‌రిస్తున్నారు. పరుపుల కింద న‌గ‌దు, బంగారం దాచిపెట్ట‌డం కార‌ణంగా ఆ ఇంటి య‌జ‌మానిని ద‌రిద్రం వెంటాడుతుంద‌ని చెబుతున్నారు.

న‌గ‌దు, బంగారంతో పాటు బెడ్ కింద ఏం ఉంచ‌కూడ‌దు..?