Silver Hallmarking | అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి (Silver) ఓ వెలుగు వెలుగుతోంది. వైట్ మెటల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో బంగారం కంటే వెండి ధరే ఎక్కువగా ఉంది. బంగారాన్ని మించి వెండి ధర పరుగులు పెడుతోంది. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2.51 లక్షలకుపైనే పలుకుతోంది. ఇలాంటి సమయంలో వినియోగదారులు మోసాలబారిన పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ ఆలోచన చేసింది. బంగారం తరహాలోనే వెండికి కూడా హాల్‌మార్కింగ్ (Silver hallmarking) తప్పనిసరి చేయాలని యోచిస్తోంది.
ప్రస్తుతం మార్కెట్‌లో వెండి ఆభరణాలకు హాల్‌మార్కింగ్ తప్పనిసరి లేదు. కానీ ప్రస్తుతం ధరలు పెరుగుతుండటంతో వెండికి కూడా తప్పనిసరిగా హాల్‌మార్కింగ్ ఉండాలని పరిశ్రమ వర్గాల నుంచి డిమాండ్ పెరుగతోంది. అందుకు తగ్గట్టుగా నిబంధనలు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు బీఐఎస్ డైరెక్టర్ జనరల్ సంజయ్ గార్గ్ తెలిపారు. కొత్త నిబంధనలు రూపొందించే ముందు అవసరమైన వనరులపై అంచనా వేయనున్నట్లు వివరించారు. ఆ తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.
కాగా, హాల్ మార్కింగ్ అనేది స్వచ్ఛతకు, నాణ్యతకు ప్రామాణికంగా నిలుస్తుంది. భారత ప్రభుత్వం 2021 జూన్ నుంచి ఆభరణాలకు హాల్ మార్కింగ్ తప్పనిసరి చేసింది. కొనుగోలుదారులు మోసాలబారిన పడకుండా ఈ హాల్‌మార్కింగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. బీఐఎస్ గణాంకాల ప్రకారం.. 2024లో హాల్‌మార్క్ ఉన్న వెండి వస్తువుల సంఖ్య 31 లక్షలు కాగా, 2025కు అది 51 లక్షలకు చేరింది.
అయితే, వెండిని కరిగించి చిన్న చిన్న ఆభరణాలు తక్కువ ధరలో విక్రయించటం వల్ల వాటికి హాల్‌మార్క్ ధృవీకరణ పత్రాలు ఇవ్వడం కొంత కష్టతరంగా మారింది.
ఇవి కూడా చదవండి :
Tanuja | హీరోయిన్స్ మాదిరిగానే బిగ్ బాస్ బ్యూటీకి కూడా చేదు అనుభవం.. తోయోద్దన్నా వినని ఫ్యాన్స్
Bald Head | భర్తకు బట్టతల.. ఈ మొగుడు నాకొద్దంటూ పోలీసు స్టేషన్ మెట్లెక్కిన భార్య
