Site icon vidhaatha

Vinayaka Chavithi | మీ ఇంట్లో వినాయ‌క విగ్ర‌హం పెడుతున్నారా..? అయితే ఈ రెండు దిశ‌లు అస‌లు ప‌నికిరావ‌ట‌.! జ‌ర జాగ్ర‌త్త‌..!!

Vinayaka Chavithi | హిందూ పండుగ‌ల్లో వినాయ‌క చ‌వితి( Vinayaka Chavithi ) ముఖ్య‌మైంది. దేశ వ్యాప్తంగా వినాయ‌క చ‌వితి న‌వ‌రాత్రుల‌ను ఘ‌నంగా నిర్వ‌హించుకుంటారు. లంబోద‌రుడికి తొమ్మిది రోజుల పాటు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి.. అనంత‌రం చెరువులు, న‌దుల్లో నిమ‌జ్జ‌నం( Immersion ) చేస్తుంటారు. అయితే ఈ ఏడాది వినాయ‌క చ‌వితిని ఆగ‌స్టు 25వ తేదీన జ‌రుపుకోనున్నారు. ఈ క్ర‌మంలో భ‌క్తులు వినాయ‌క చ‌వితి వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే గ‌ణ‌నాథుడిని ప్ర‌తిష్టించేందుకు ఈ రెండు దిశ‌లు అనుకూల‌మ‌ట‌. మ‌రో రెండు దిశ‌ల్లో మాత్రం గ‌ణ‌నాథుల‌ను ప్ర‌తిష్టించ‌కూడ‌ద‌ని వాస్తు పండితులు చెబుతున్నారు.

ఈ రెండు దిశ‌లు అనుకూలం..

వాస్తు ప్ర‌కారం.. వినాయ‌కుడిని ఇంట్లో ప్ర‌తిష్టించే వారు ఈశాన్య దిశ‌లోనే ప్ర‌తిష్టించేలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని వాస్తు పండితులు సూచిస్తున్నారు. ఈ దిశ‌లో లంబోద‌రుడిని ప్ర‌తిష్టించ‌డం వ‌ల్ల ఆ ఇంట సంప‌ద పెర‌గ‌డమే కాదు.. ఆరోగ్యంగా కూడా ఉంటార‌ట‌. ఆర్థికంగా కూడా క‌లిసివ‌స్తుంద‌ట‌. ఇక తూర్పు దిశ‌లో వినాయ‌క విగ్ర‌హాన్ని పెట్టినా కూడా మంచిద‌ని వాస్తు పండితులు చెబుతున్నారు.

ఈ రెండు దిశ‌లు ప్ర‌తికూలం..

కానీ వాస్తు ప్రకారం వినాయకుడి విగ్రహాన్ని పశ్చిమం లేదా దక్షిణ దిశలో ఉంచడం అశుభకర‌మ‌ని వాస్తు పండితులు చెబుతున్నారు. ఈ రెండు దిశ‌ల్లో గ‌ణ‌నాథుడిని ప్ర‌తిష్టించ‌డం వ‌ల్ల ఆ ఇంట్లో ఆర్థిక క‌ష్టాలు సంభ‌వించ‌డంతో పాటు న‌ష్టాలు, ఆరోగ్య స‌మ‌స్య‌లు తలెత్తే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు వాస్తు పండితులు.

అలాగే తప్పనిసరిగా గణేష్ విగ్రహాం ఇంటి పూజగదిలో ఉండేలా ప్లానింగ్ చేసుకుంటే మంచిది. దీని వలన సానుకూల శక్తి లభించడమే కాకుండా, గణేషుడి ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడూ లభిస్తాయంట. ఇక మట్టి విగ్రహం మీడియం సైజులో ఉండాలట. గణేషుడి విగ్రహంతోపాటు లక్ష్మీ దేవి కూడా ఉండటం వలన సంపద శ్రేయస్సు పెరుగుతుందట. సో ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌క పాటించండి భ‌క్తులారా..

Exit mobile version