Site icon vidhaatha

Ashadha Amavasya | రేపే ఆషాఢ అమావాస్య‌.. చేయాల్సిన‌వి.. చేయ‌కూడ‌నివి ఇవే..!

Ashadha Amavasya | హిందూ మ‌త విశ్వాసాల ప్రకారం.. అమావాస్య తిథి హిందువుల‌కు ఎంతో ప్రాముఖ్య‌త క‌లిగిన రోజు. ఆషాఢ మాసంలో వ‌చ్చే అమావాస్య మ‌రి ముఖ్య‌మైంది. ఎందుకంటే ఆ రోజున మ‌ర‌ణించిన మ‌న పూర్వీకులు త‌మ కుటుంబ స‌భ్యుల‌ను చూసేందుకు వ‌స్తార‌ని న‌మ్మ‌కం. ఇక ఆషాఢ అమావాస్య రోజున దాన‌ధ‌ర్మాలు చేయ‌డం వ‌ల్ల శుభ‌ఫ‌లితాలు క‌లుగుతాయ‌ని విశ్వ‌సిస్తారు. అయితే ఈ రోజున చేయాల్సిన ప‌నులు, చేయ‌కూడ‌ని ప‌నుల‌ను తెలుసుకుందాం. అలాగే ఆషాఢ అమావాస్య ఏ స‌మ‌యంలో వ‌స్తుంద‌నే విష‌యాన్ని కూడా తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం.

ఆషాఢ అమావాస్య ఎప్పుడు..?

ఈ సంవత్సరం జూలై 5వ తేదీన ఉదయం 4. 45 నిమిషాలకు ఆషాడ అమావాస్య వస్తుంది. ఇది మరుసటి రోజు జులై ఆరవ తేదీ శనివారం తెల్లవారుజామున 4 గంటల 26 నిమిషాలకు ముగుస్తుంది. తిథి ప్రకారం జూలై 5న ఉదయం అమావాస్య జరుపుకుంటారు.

అమావాస్య నాడు ఏం చేయాలి..?

ఆషాఢ అమావాస్య‌ రోజున వేకువ‌జామునే నిద్ర మేల్కొని స్నానం చేయాలి. పూర్వీకుల పేర్లతో పేద ప్రజలకు బట్టలు, ధాన్యాన్ని దానం చేయాలి. పూర్వీకులకు తర్పణం చేసేటప్పుడు నల్ల నువ్వులు, తెల్లటి పువ్వులను మీ చేతులలో ఉంచుకోండి. ఆషాఢ అమావాస్య సాయంత్రం అశ్వత్థ చెట్టు కింద ఆవాల నూనె దీపం వెలిగిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. చనిపోయిన పూర్వీకులు అశ్వత్థ వృక్షంలో ఉంటారని నమ్మకం. అలాగే సాయంత్రం ఇంటికి దక్షిణం వైపున ఆవనూనె దీపం వెలిగించండి. ఇక ఆషాడ అమావాస్య రోజు ఉప్పు, పంచదార, బియ్యం పిండి దానం చేస్తే మంచి జరుగుతుంది. పేదలకు పూర్వీకుల పేరు మీద అన్నదానం చేసినా ఫలితం ఉంటుంది.

ఏం చేయకూడదు?

ఆషాఢ అమావాస్య తిథిలో కొన్ని నియమాలు పాటించడం ముఖ్యం. మీరు ఈ రోజును మరచిపోయి కూడా వృద్ధుల పట్ల అనుచితంగా ప్రవర్తించకండి. మద్యం లేదా మాంసాన్ని తాకవద్దు. ఆషాఢ అమావాస్య నాడు సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. అమావాస్య తిథి నాడు బిచ్చగాడు మీ ఇంటికి వస్తే, అతనిని ఖాళీ చేతులతో తిప్పి పంపకండి. ఎవరితోనూ పొరపాటున కూడా గొడవలు పడకూడదు.

Exit mobile version