చాలా మంది కాళ్లకు, చేతులకు నల్ల దారం కట్టుకుంటారు. ఎందుకంటే.. ఇతరుల కన్ను మనపై పడకూడదని, దిష్టి తగలొద్దని నల్ల దారం కట్టుకుంటుంటారు. ఈ క్రమంలో నల్లదారం కట్టుకోవడం కూడా సహజమైపోయింది. అయితే ఈ నల్లదారానికి జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. చేతి మణికట్టుకు నల్ల దారం కట్టుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించొచ్చని చెబుతున్నారు. మరి ఆ లాభాలు, ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం..
- జ్యోతిష్యశాస్త్రంలో నల్లదారం అదృష్టం, సంపదకు చిహ్నంగా భావిస్తారు. చేతికి నల్లదారం కట్టుకోవడం వల్ల అదృష్టంతో పాటు సంపద కూడా సమకూరుతుంది. ఎలాంటి అడ్డంకులు ఎదురైనా నల్లదారం కట్టుకుంటే పరిష్కారం లభిస్తుందని చాలా మంది నమ్మకం.
- ప్రతికూల పరిస్థితుల్ని నుంచి మనల్ని మనం రక్షించుకోవడం ముఖ్యం. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఒత్తిడికి కూడా లోనవుతుంటాం. చెడు శక్తుల వల్లే ఇదంతా జరుగుతుంది. కాబట్టి చెడు శక్తులను దూరం చేసేందుకు మణికట్టుకు నల్లదారం కట్టుకుంటే మేలు జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
- మణికట్టుకు నల్లదారం కట్టుకున్నట్లయితే ఆధ్మాత్మికత వైపు మనస్సు మళ్లుతుందట. ఈ క్రమంలో అంతర్ దృష్టిని, అవగాహనను కూడా పెంచుతుందట.
- మనం ఎక్కువ సంపాదించినా, సమాజంలో మంచి పేరు తెచ్చుకున్నా.. కొందరు జీర్ణించుకోలేరు. మానవ దిష్టి అనేది శని దోషమంతా ప్రభావవంతమైంది. నల్ల దారాన్ని కట్టుకుంటే ఇతరుల కన్ను మీపై ఉండదు. మీ పని మీరు మరింత సమర్థవంతంగా చేసేందుకు సహాయపడుతుంది.
- మీ మణికట్టు చుట్టూ నల్లదారం ధరిస్తే.. గ్రహల ప్రభావం తగ్గుతుంది. చెడు శక్తులు మీ దగ్గరకు రాకుండా ఉంటాయి. అంతేకాదు నల్లదారం విశ్వ శక్తులతో మిమ్మల్ని కలిపేందుకు సహాయపడుతుంది.
- శని ప్రభావం ప్రతికూలంగా ఉంటే జీవితంలో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవల్సి వస్తుంది. చేతి మణికట్టుకు నల్లదారం కట్టుకుంటే శని దేవుని అనుగ్రహం లభిస్తుంది. దీని వల్ల మీరు తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.