Site icon vidhaatha

Shakambari Mahotsavam| కూరగాయల కాంతిలో మెరిసిన అమ్మవారి శాకాంబరి అలంకారం

Shakambari ammavaru

Shakambari Mahotsavam| విధాత‌, వ‌రంగ‌ల్ ప్ర‌తినిధిః శ్రీ భద్రకాళి దేవస్థానంలో గత పదిహేను రోజులుగా జరుగుతున్న రాకాంత దీక్ష పూర్వక శాకంభరీ నవరాత్రులు గురువారం ముగిశాయి. ఆషాడ శు| పౌర్ణమి రోజున అమ్మవారిని శాకంభరిగా అలంకరించి పూజారాధనలు జరిపారు. ఉద‌యం దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్స‌వాల‌లో పాల్గొన్నారు. అనంతరం శాకంభరీ అలంకారములో ఉన్న అమ్మవారిని దర్శించుకొని భ‌క్తులు పులకించిపోయారు. ఆలయానికి విచ్చేసిన మంత్రికి పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. దేవస్థానం ప్రాంగణంలో ఆలయ ఈఓ శ్రీమతి శేషుభారతి పోలీసులు, వివిధ‌ ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేశారు. ఈ సంద‌ర్భంగా వేలాదిమంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. సుమారు 10వేల‌ కిలోల కూరగాయలు, పండ్లు సేకరించి దండలుగా చేసి అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. అమ్మవారి అలంకరణకు కావలసిన కూరగాయలు, వండ్లు నిన్న సాయంకాలం నుండి భక్తులు సుచిగా గుడికి చేరుకొని అర్చ‌కుల‌ సూచనల మేర‌కు దండలుగా గుచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య చైర్మన్ డా॥ బి. శివసుబ్రహ్మణ్యమ్, ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న. గాదె శ్రవణ్ కుమార్ రెడ్డి, ఓరుగంటి పూర్ణచందర్, తొగరు బ్రాంతి, బింగి సతీష్, మోతుకూరి మయూరి రామేశ్వర్రావు, గాండ్ల స్రవంతి, నార్ల సుగుణ. వెలడుగు అంజనేయులు, జారతి వెంకటేశ్వర్లు, అనంతుల శ్రీనివాస్ రావు, ఈవో శేషు భారతి ప్రధానార్చకులు శ్రీ భద్రకాళి శేషు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Exit mobile version