Oleander Plant | ఇంటి ఆవ‌ర‌ణ‌లో గ‌న్నేరు పూల చెట్లు పెంచుకోవ‌చ్చా..? వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో తెలుసా..?

Oleander Plant | చాలా మంది త‌మ ఇంటి ఆవ‌ర‌ణ‌లో ర‌క‌ర‌కాల మొక్క‌ల‌ను పెంచుకుంటుంటారు. అవి పూల మొక్క‌లు కావొచ్చు.. పండ్ల చెట్లు కావొచ్చు.. ఇంటికి ఆందాన్నిచ్చే మొక్క‌లు కూడా కావొచ్చు. ఇలా ర‌క‌ర‌కాల మొక్క‌లు, చెట్ల‌ను పెంచుకోవ‌డం వ‌ల్ల ఆ ఇంట్లో ప్ర‌శాంత వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతుంది.

  • Publish Date - June 28, 2024 / 07:32 AM IST

Oleander Plant | చాలా మంది త‌మ ఇంటి ఆవ‌ర‌ణ‌లో ర‌క‌ర‌కాల మొక్క‌ల‌ను పెంచుకుంటుంటారు. అవి పూల మొక్క‌లు కావొచ్చు.. పండ్ల చెట్లు కావొచ్చు.. ఇంటికి ఆందాన్నిచ్చే మొక్క‌లు కూడా కావొచ్చు. ఇలా ర‌క‌ర‌కాల మొక్క‌లు, చెట్ల‌ను పెంచుకోవ‌డం వ‌ల్ల ఆ ఇంట్లో ప్ర‌శాంత వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతుంది. అయితే కొన్ని మొక్క‌లు, చెట్లు నెగిటివ్ ఎన‌ర్జీని క‌ల్పిస్తాయి. కాబ‌ట్టి వాస్తు నిపుణుల స‌ల‌హా మేర‌కు మొక్క‌ల‌ను పెంచుకుంటే మంచిది. అయితే ల‌క్ష్మీదేవికి ఎంతో ఇష్ట‌మైన గ‌న్నేరు పూల మొక్క‌ల‌ను ఇంటి ఆవ‌ర‌ణ‌లో పెంచుకోవ‌చ్చా..? లేదా..? అనే విష‌యంలో వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

ప్ర‌తి ఇంటి ఆవ‌ర‌ణ‌లో దాదాపు గ‌న్నేరు పూల మొక్క‌లు క‌నిపిస్తుంటాయి. ఎరుపు, తెలుపు, ప‌సుపు వంటి వివిధ రంగుల్లో ఉండే గ‌న్నేరు పూలు ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉంటాయి. ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉండే ఈ గ‌న్నేరు పూల‌కు వాస్తు శాస్త్రంలో అత్య‌ధిక ప్రాధాన్య‌త ఉంది. గ‌న్నేరు పూల‌తో ల‌క్ష్మీదేవిని పూజించ‌డం వ‌ల్ల ఇంట్లోని అశాంతులు తొల‌గిపోయి, సంతోషాలు వెల్లివిరుస్తాయ‌ని, సిరిసంప‌ద‌ల‌కు ఎలాంటి లోటు ఉండ‌ద‌ని వాస్తు పండితులు చెబుతున్నారు. అలాగే ఇంట్లో నెగెటివ్‌ ఎనర్జీ దూరమైపోయి.. పాజిటివ్‌ ఎనర్జీ వస్తుంద‌ని పేర్కొంటున్నారు.

అయితే, ఈ చెట్టును ఇంటి ఆవరణలో పెంచకుండా.. బయట పెంచి.. ఆ పూలను పూజకు ఉపయోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల ఎలాంటి దోషం ఉండదంటున్నారు. కాబ‌ట్టి ఇంటి ప్ర‌హ‌రీ గోడ బ‌య‌ట ఈ పూల మొక్క‌ల‌ను పెంచుకుంటే మంచిది. ఇక అవ‌స‌ర‌మైనప్పుడు పూలను కోసుకుని పూజ‌కు ఉపయోగించుకుంటే స‌రిపోతుంది.

Latest News