చాలా మందికి రాత్రి నిద్రించినప్పటి నుంచి పొద్దున్నే మేల్కొనే వరకు ఏదో సమయంలో కలలు వస్తుంటాయి. ఆ కలలు రకరకాలుగా ఉండొచ్చు. మనం రోజు చేసే పనులు కావొచ్చు. లేదా ఎవరైనా చనిపోయినట్లు లేదా శుభకార్యం జరిగినట్లు, భవిష్యత్ గురించి, భూతకాలంలో చేసిన పనులు కావొచ్చు కలల రూపంలో వస్తుంటాయి. అయితే మీరు చనిపోయినట్లు మీకే కల వచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి. ఇలా ప్రతి కల వెనుక మంచి లేదా చెడు సంకేతాలు ఉంటాయి. మరి ఏయే కలలు వస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం..
సంతోషంగా ఉన్నట్లు కల వస్తే..
మనం సంతోషంగా, నవ్వుతూ ఉన్నట్లు కల వస్తే.. భవిష్యత్‌లో శుభవార్తలను వింటారని స్వప్న శాస్త్రం చెబుతుంది. అంతేకాకుండా జీవితంలో సిరిసంపదలు పెరుగుతాయని అర్థం.
ఏడుస్తున్నట్లు కల వస్తే..
స్వప్న శాస్త్రం ప్రకారం.. ఏడుస్తున్నట్లు కల వస్తే శుభప్రదంగా భావిస్తారు. మీ ఏడుపుని మీరే కలలో చూసుకోవడం మంచి సంకేతంగా పరిగణిస్తారు. ఆ వ్యక్తి జీవితంలో ఏదో ఒక పెద్ద విజయాన్ని సొంతం చేసుకోవచ్చు. జీవితం విలాసవంతంగా గడపబోతున్నాడని అర్థం.
చనిపోయినట్లు కల వస్తే..
మీరు చనిపోయినట్లు మీకే కల వస్తే.. భవిష్యత్‌లో సుధీర్ఘ జీవితాన్ని గడపబోతున్నారని అర్థం. మీ మృతదేహం స్మశాన వాటికలో ఉన్నట్లు లేదా మృతదేహం ఊరేగుతున్నట్లు కల వచ్చినా.. మీరు అతిపెద్ద విజయం సాధించబోతున్నారని అర్థం. ఇలాంటి కలలు అదృష్టానికి సంకేతాలు.
కింద పడిపోతున్నట్లు కల వస్తే..
కలలో మీరు ఎత్తు నుండి పడిపోతున్నట్లు కనిపిస్తే స్వప్న శాస్త్రం ప్రకారం అశుభం. మీ కలలో మీరు భవనం నుండి పడిపోతున్నట్లు కనిపిస్తే మీ జీవితంలో కొన్ని సమస్యలు రాబోతున్నాయని లేదా మీకు కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలు ఏర్పడవచ్చని విశ్వాసం.