ఇంటికి ఈ మూడు రంగులు వేస్తున్నారా..? అయితే దంప‌తుల మ‌ధ్య క‌ల‌హాలు త‌ప్ప‌వు..!

కొన్ని రంగులు ఇంటికి న‌ష్టాన్ని క‌లుగజేస్తాయ‌ని, ఆ కుటుంబంలో దంప‌తుల మ‌ధ్య క‌ల‌హాల‌కు కార‌ణ‌మ‌వుతాయ‌ని నిపుణులు పేర్కొంటున్నారు. కాబ‌ట్టి ఈ మూడు రంగుల‌కు దూరంగా ఉండాల‌ని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. మ‌రి ఆ మూడు రంగులు ఏవో తెలుసుకుందాం..

  • Publish Date - May 3, 2024 / 06:25 AM IST

ఇటీవ‌లి కాలంలో ప్ర‌తిఒక్క‌రూ త‌మ ఇంటిని ఎంతో అందంగా నిర్మించుకుంటున్నారు. ప్ర‌హ‌రీ గోడ నుంచి మొద‌లుకుంటే ఇంటిరీయ‌ర్ డిజైన్ వ‌ర‌కు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. ట్రెండ్‌ను ఫాలో అవుతూ.. ఆక‌ర్ష‌ణీయంగా ఇంటిని తీర్చిదిద్దుకుంటున్నారు. ఇక ఇంటికి వేసే రంగుల్లోనూ చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. కొంద‌రైతే ఏదో ఒక రంగును వేయించేస్తున్నారు. ఇలా ఏదో ఒక రంగు వేయ‌డం మంచిది కాద‌ని వాస్తు నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. కొన్ని రంగులు ఇంటికి న‌ష్టాన్ని క‌లుగజేస్తాయ‌ని, ఆ కుటుంబంలో దంప‌తుల మ‌ధ్య క‌ల‌హాల‌కు కార‌ణ‌మ‌వుతాయ‌ని నిపుణులు పేర్కొంటున్నారు. కాబ‌ట్టి ఈ మూడు రంగుల‌కు దూరంగా ఉండాల‌ని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. మ‌రి ఆ మూడు రంగులు ఏవో తెలుసుకుందాం..

ఎరుపు రంగు

ఎరుపు అదృష్టానికి సంకేతం. ఎరుపు అదృష్టానికి, శక్తి ప్రవాహానికి, విజయానికి కూడా ప్రతీక. మ‌న‌సును ఉత్తేజ పరిచే రంగు కూడా. ఎరుపు ఎక్కువగా కనిపించినపుడు చంచలంగా ఉంటుంది. కొన్ని సార్లు ఇలాంటి వాతావరణం ఒత్తిడి, ఆందోళనకు దారితీస్తుంది. డైనింగ్, ఆఫీస్, వంటగది, పిల్లలగది, పడక గదులకు ఎరుపు రంగు అంత మంచిది కాదు. పడకగదిలో ఎరుపు రంగు దంపతుల మధ్య సంబంధాలను దెబ్బతీయవచ్చు. కోపం పెరిగిపోయి కుటుంబ సామరస్యం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాబ‌ట్టి ఎరుపు రంగుకు దూరంగా ఉంటేనే మంచిద‌ని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

తెలుపు రంగు

తెలుపు స్వచ్ఛతకు చిహ్నం. తెలుపు ఎక్కువ వాడితే ఆ పరిసరాలు చల్లగా ఉంటాయ‌నేది న‌మ్మ‌కం. ఇలా చల్లగా, ఖాళీ భావన కలిగించే తెలుపు ఆందోళన పెంచుతుందని నిపుణులు సూచిస్తున్నారు. బాత్రూమ్ లేదా వంటగదిలో ఈ రంగు వాడితే ఫర్వాలేదు కానీ డైనింగ్ లేదా పిల్లల గదుల్లో ఈ రంగు అంత మంచిది కాద‌ని వాస్తు శాస్త్రం చెబుతుంది.

నలుపు రంగు

నలుపు రహస్యానికి, ఆత్మపరిశీలనకు సంకేతం. నలుపు రంగు ఎక్కువగా కనిపిస్తే ఆ ప్రదేశం స్తబ్దుగా ఉన్నట్టు అనిపిస్తుంది. నలుపు రంగును ఇంట్లో వీలైనంత తక్కువ వాడడం మంచది. కొందరికి నలుపు ఇష్టమైందిగా ఉంటుంది. కానీ నలుపు రంగు చీకటికి సంకేతం. లివింగ్ రూమ్ ముదురురంగుల్లో ఉండాలని అనుకుంటే బ్రౌన్, చాక్లేట్ వంటి ఇతర ఆప్షన్లు ఎంచుకోవడం మంచిది. న‌లుపు రంగుకు దూరంగా ఉంటేనే మంచిది. దంప‌తుల మ‌ధ్య క‌ల‌హాల‌కు కూడా ఈ రంగు కార‌ణ‌మ‌వుతుంది.

Latest News