Sri Rama Navami | శ్రీరామనవమి అంటే గుర్తుకు వచ్చేది పానకమే..! మరి ఈ పానకం ప్రాధాన్యం తెలుసా..?

Sri Rama Navami | హిందు సంప్రదాయాల్లో పండుగలకు ఎంతో ప్రాధాన్యం ఉన్నది. ప్రతి పండుగ ఒక్కొక్క ప్రసాదం.. ఒక్కో దేవుడికి ఒక్కో ప్రసాదం నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీగా వస్తున్నది. భగవంతుడికి నైవేద్యంగా సమర్పించిన అనంతరం ఆ దాన్ని అందరికీ ప్రసాదంగా పంచిపెట్టడం ఆనవాయితీగా వస్తున్నది. రువుతువులను బట్టి దేవుళ్లకు సమర్పించే నైవేద్యం సైతం మారుతూ వస్తుంటుంది. ఉగాదితో వేసవి ఆరంభమవుతుంది.

  • Publish Date - April 17, 2024 / 06:30 AM IST

Sri Rama Navami | హిందు సంప్రదాయాల్లో పండుగలకు ఎంతో ప్రాధాన్యం ఉన్నది. ప్రతి పండుగ ఒక్కొక్క ప్రసాదం.. ఒక్కో దేవుడికి ఒక్కో ప్రసాదం నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీగా వస్తున్నది. భగవంతుడికి నైవేద్యంగా సమర్పించిన అనంతరం ఆ దాన్ని అందరికీ ప్రసాదంగా పంచిపెట్టడం ఆనవాయితీగా వస్తున్నది. రువుతువులను బట్టి దేవుళ్లకు సమర్పించే నైవేద్యం సైతం మారుతూ వస్తుంటుంది. ఉగాదితో వేసవి ఆరంభమవుతుంది. ఉగాదికి షడ్రుచుల పచ్చడిని సేవిస్తాం.

ఆ తర్వాత వచ్చే పండుగ శ్రీరామనవమి. ఆ రోజున ప్రతి పల్లెలో సీతారాముల కల్యాణోత్సవ వేడుకలు జరుగుతుంటాయి. ఆ వేడుకల్లో భక్తులకు చలిమిడి వడపప్పు, పానకాన్ని ప్రసాదంగా పంచిపెడుతుంటారు. ఉగాది నుంచి ఎండవేడిమి మొదలవుతుంది. రోజులు గడుస్తున్న కొద్దీ వేడి పెరుగుతూ వస్తుంది. అందుకే శ్రీరామనవమికి తాటాలతో పందిళ్లు వేస్తారు. అయితే పానకాన్ని ఎందుకు పంచిపెట్టడంలోనూ వెనుక ఆరోగ్య రహస్యాలు సైతం ఉన్నది. పానకం సేవించడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. పానకంలో వేసే బెల్లం శరీరంలో వేడిని తగ్గిస్తుంది. అందులోనే ఐరన్ సైతం ఉంటుంది. మిరియాలు కఫాన్ని తగ్గిస్తాయి. శొంఠితో దగ్గు రాకుండా ఉంటుంది. శరీరంలో ఉష్ణశాతాన్ని సమంగా ఉండేలా చేస్తుంది. యాలకలు జీర్ణప్రక్రియను సరిచేస్తుంది.

తులసీదళం శ్రీమహావిష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైంది. శ్రీరామనవమి రోజున రాములవారిని ముఖ్యంగా తులసీదళంతోనే పూజిస్తుంటారు. తులసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే వడపప్పు వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది. బుధగ్రహానికి పెసరపప్పు ప్రీతికరమైంది. అయితే, మంచి చేస్తుందని ప్రతిరోజూ ఈ పానకాన్ని తాగరు. అందుకే వేసవి ప్రారంభంలో వచ్చే సీతారాముల కల్యాణోత్సవంలో మాత్రమే భక్తులకు ఈ వడపప్పు పాకాన్ని భక్తులకు పంచిపెడుతారు. శ్రీరామనవమి రోజున ఎవరైనా భక్తులు ఆలయాలను సందర్శిస్తే ఈ వడపప్పు, పానకం ప్రసాదం తీసుకోవడం మరచిపోవద్దు.

Latest News