Ganesh Puja | గణేశ్ చతుర్ధి( Ganesh Chaturthi ) నాడు బొజ్జ గణపయ్యకు భక్తులందరూ 21 రకాల ఆకుల( 21 leaves )తో పూజలు నిర్వహిస్తారు. విఘ్నేశ్వరుడి పూజలో ఉపయోగించే ఆ 21 ఆకులకు ఎంతో విశిష్టత ఉంది. అంతేకాదు.. ఆ ఆకులు సాధారణమైనవి కావు.. ఇవన్నీ మహోత్కృష్టమై, శక్తివంతమైన ఔషధ గుణాలు కలిగి ఉన్నవి. మరి 21 ఆకులను సమర్పించే సమయంలో ఏ ఆకుకు ఏ నామం జపించాలో తెలుసుకుందాం.
ఏ ఆకుకు ఏ నామం జపించాలంటే..
ఓం సుముఖాయ నమః – మాచీపత్రం పూజయామి ॥ మాచిపత్రి
ఓం గణాధిపాయ నమః – బృహతీపత్రం పూజయామి॥ వాకుడాకు
ఓం ఉమా పుత్రాయ నమః- బిల్వపత్రం పూజయామి॥ మారేడు
ఓం గజాననాయ నమః – దూర్వాయుగ్మం పూజయామి॥ గరిక
ఓం హరసూనవే నమః – దత్తూరపత్రం పూజయామి॥ ఉమ్మెత్త
ఓం లంబోదరాయ నమః- బదరీపత్రం పూజయామి॥ రేగి
ఓం గుహాగ్రజాయ నమః – అపామార్గపత్రం పూజయామి॥ ఉత్తరేణు
ఓం ఏకదంతాయ నమః – చూతపత్రం పూజయామి॥ మామిడి
ఓం గజకర్ణికాయ నమః – తులసీపత్రం పూజయామి॥ తులసి
ఓం వికటాయ నమః – కరవీరపత్రం పూజయామి॥ గన్నేరు
ఓం భిన్న దంతాయ నమః- విష్ణుక్రాంతపత్రం పూజయామి॥ విష్ణుక్రాంతం
ఓం వటవే నమః – దాడిమీపత్రం పూజయామి॥ దానిమ్మ
ఓం సర్వేశ్వరాయ నమః – దేవదారుపత్రం పూజయామి॥ దేవదారు
ఓం ఫాలచంద్రాయ నమః- మరువకపత్రం పూజయామి॥ మరువం
ఓం హేరంబాయ నమః – సింధువారపత్రం పూజయామి॥ వావిలి
ఓం శూర్పకర్ణాయ నమః – జాజీపత్రం పూజయామి॥ జాజి
ఓం సురాగ్రజాయ నమః- గండకీపత్రం పూజయామి॥ గండకీ
ఓం ఇభవక్త్రాయ నమః – శమీపత్రం పూజయామి॥ జమ్మి
ఓం వినాయకాయ నమః- అశ్వత్థపత్రం పూజయామి॥ రావి
ఓం సుర సేవితాయ నమః- అర్జునపత్రం పూజయామి॥ మద్ది
ఓం కపిలాయ నమః – అర్కపత్రం పూజయామి॥ తెల్లజిల్లేడు