విధాత, హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) ఎర్రవెల్లి ఫామ్ హౌస్ (Erravelli Farmhouse)లో శుక్రవారం గణపతి హోమం(Ganapathi Homam)చేపట్టారు. తన సతీమణి శోభతో కలిసి గణపతి హోమంలో పాల్గొన్నారు. ప్రతి ఏటా వినాయక చవితి నవరాత్రులలో కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో ఆయన అర్చక పండితుల పర్యవేక్షణలో గణపతి హోమం నిర్వహించారు.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఐదురోజులుగా ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. పలువురు పార్టీ ముఖ్య నాయకులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు పూజలో పాల్గొన్నారని సమాచారం.