మేషం (Aries)
మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు బుద్ధిబలంతో అధిగమిస్తారు. నిర్ణయాల్లో స్థిరత్వం అవసరం. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది. వృత్తిపరంగా చేసే ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ప్రయోజనాలు అందుకుంటారు.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. వివాదాలకు, ఘర్షణలకు దూరంగా ఉండండి. వీలైనంత వరకు ఈ రోజు మౌనంగా ఉండటం మంచిది. గందరగోళ నిర్ణయాలతో మంచి అవకాశాలు కోల్పోయే ప్రమాదముంది. కుటుంబ వ్యవహారాల్లో రాజీపూర్వక ధోరణి, సర్దుకుపోయే తత్వం కలిగి ఉంటే మంచిది.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఊహించని ఆర్థిక లాభాలు ఈ రోజు అందుకుంటారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. బంధు మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. వృత్తి పరమైన నిర్ణయాలు తీసుకోవడంలో గందరగోళం నెలకొంటుంది. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. కుటుంబంలో వ్యతిరేక పరిస్థితులు ఉండవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లోపిస్తుంది. మాట నియంత్రణలో పెట్టుకోండి. అపార్థాలు తొలగించే ప్రయత్నం చేయండి.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో స్పష్టత పెరుగుతుంది. కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యకు పరిష్కారం లభిస్తుంది. చక్కటి ప్రణాళికతో, ముందుచూపుతో ఖర్చులు అదుపులో ఉంటాయి. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్తారు.
కన్య (Virgo)
కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారం, ఉద్యోగం ఏదైనా, అంతటా విజయమే! కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనువైన సమయం. వృత్తిపరమైన అభివృద్ధి, పదోన్నతులు ఆనందం కలిగిస్తాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజు వ్యాపారులకు మంచి లాభదాయకంగా ఉంది. పెట్టుబడులు, లాభాలు గణనీయంగా పెరుగుతాయి. వృత్తినిపుణులు, ఉద్యోగులకు సహచరులు, తోటి ఉద్యోగుల నుంచి మంచి సహకారం లభిస్తుంది. తీర్థయాత్రకు వెళ్లే సూచనలున్నాయి.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. బుద్ధిబలంతో వ్యవహరిస్తే చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ప్రయాణాల్లో సురక్షితంగా ఉండటానికి ప్రయత్నించండి. కొత్త పథకాలు, కార్యక్రమాలు వాయిదా వేయాలి. కోపాన్ని నియంత్రించుకోండి.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ రోజు సంతోషకరంగా ఉంటుంది. అన్ని పనులు అనుకున్నట్లుగా జరగడంతో ఈ రోజు అంతా ఆనందంగా గడుపుతారు. కుటుంబంతో చేసే పర్యటనలు ఆహ్లదంగా సాగుతాయి. సాహిత్యపరమైన కార్యకలాపాలకు ఈ రోజు అనుకూలంగా ఉంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు. ఒక శుభవార్త ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ముందుచూపుతో ఆర్థిక స్థిరత్వం సాధిస్తారు.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడి పెరుగుతుంది. అధికారులతో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. ఈ రోజు వీలైనంత వరకు కొత్త పనులు, ప్రయాణాలు చేపట్టవద్దు. ఆర్థిక పరిస్థితి గురించి రోజంతా ఆందోళన చెందుతారు. ఖర్చులు అధికంగా ఉండవచ్చు.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఇంటా బయట దాదాపు ప్రతి విషయంలో ఈ రోజు కఠినమైన సమస్యలు ఎదుర్కొంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోండి. ఊహించని విధంగా ఆస్తులు, సంపదలు దెబ్బతింటాయి.
