Horoscope | గురువారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి బంధు మిత్రుల‌తో క‌ల‌హాలు..!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మనోబలంతో చేసే పనులు సఫలం అవుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధ, ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి. ఆర్థిక పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు రాకుండా జాగ్రత్త వహించండి. వృథా ఖర్చులు నివారించండి.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ సామర్థ్యాన్ని, ప్రతిభను అందరూ గుర్తిస్తారు. వ్యాపారంలో పోటీని సమర్థవంతంగా అధిగమిస్తారు. ఆర్థికంగా బలోపేతం అవుతారు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలు, ఒప్పందాలు చేసుకోవడానికి ఈ రోజు బ్రహ్మాండంగా ఉంది. ఉద్యోగంలో లభించే నూతన అవకాశాలు లాభదాయకంగా ఉంటాయి. సంపదలు పెరుగుతాయి. గొడవలకి, వివాదాలకి దూరంగా ఉండండి. మోసపూరిత ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించండి.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సమాజంలో గొప్పవారిని చూసి స్ఫూర్తి పొందుతారు. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. క్లిష్ట పరిస్థితుల్లో బంధువుల నుంచి ఆర్థిక సాయం అందుతుంది. భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తారు. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించండి.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు సరదాగా గడిచిపోతుంది. ఉద్యోగంలో పురోగతి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు. ఆస్తి వ్యవహారాలు లాభదాయకంగా ఉంటాయి. పూర్వీకుల ఆస్తుల నుంచి కొన్ని లాభాలు అందుతాయి.

కన్య (Virgo)

కన్య రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శ్రేష్ఠమైన సమయం నడుస్తోంది. బుద్ధిబలంతో కీలక వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.

తుల (Libra)

ప్రణాళికతో ప్రారంభించిన పనులు పూర్తి చేస్తారు. ఆర్థికంగా కలిసి వచ్చే రోజు. ఉద్యోగ వ్యాపారాల్లో శుభ ఫలితాలు ఆశించవచ్చు. కీలక వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. స్నేహితులతో విహారయాత్రలకు వెళ్తారు. వ్యాపారులకు ఈ రోజు విపరీతమైన లాభాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢ పడుతుంది.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో శాంతి సౌఖ్యాలు నెలకొంటాయి. జీవిత భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది. బంధువులు, రక్త సంబంధీకులు, స్నేహితుల నుంచి ఆర్థిక లబ్ధి కలుగుతుంది. ప్రారంభించిన పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో పదోన్నతి, పరపతి, ప్రశంసలు లభిస్తాయి.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఫలప్రదంగా ఉంటుంది. శుభసమయం నడుస్తోంది. చిత్తశుద్ధితో, ఏకాగ్రతతో పనిచేసి లక్ష్యాలను చేరుకుంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో అధికార యోగం ఉంటుంది. స్వస్థానప్రాప్తి కూడా ఉండవచ్చు. ఆర్థిక విషయాల్లో అనుకూలత ఉంటుంది. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు సానుకూల ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనులన్నీ సావకాశంగా పూర్తవుతాయి. ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి అనువైన రోజు. ఉద్యోగ వ్యాపారాల్లో ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక స్థిరత్వం సాధిస్తారు. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోండి.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ఆశించిన పదోన్నతులు పొందుతారు. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పరోపకార కార్యక్రమాలలో విరివిగా పాల్గొంటారు. సమాజంలో గౌరవం, పరపతి పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. బంధుమిత్రులతో అనవసర వాదనలు కలహాలకు దారితీస్తాయి. సహనంతో క్రమంగా పరిస్థితి మెరుగు పడుతుంది. వృథా ఖర్చులు పెరుగుతాయి.

Latest News