మేషం (Aries)
మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. స్వల్ప ప్రయత్నంతోనే గొప్ప విజయాలు సాధిస్తారు. కీలక వ్యవహారాల్లో పెద్దల సూచనలు పనిచేస్తాయి. ఆర్థిక పరిసితి మెరుగ్గా ఉంటుంది.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అద్భుతమైన కాలం నడుస్తోంది. ఏ పని తలపెట్టినా విజయం వెన్నంటే ఉంటుంది. లక్ష్మీకటాక్షంతో ఐశ్వర్యవంతులవుతారు. శుభ గ్రహాల అనుకూలత వలన శత్రువులు కూడా మిత్రులవుతారు. శుభకార్యాల్లో బంధు మిత్రులతో ఉత్సాహంగా పాల్గొంటారు.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు అవలీలగా అధిగమిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థిక ప్రయోజనాలు మెండుగా ఉంటాయి. అవివాహితులకు కల్యాణ యోగం ఉంది. సామాజిక గౌరవానికి భంగం కలిగే పనులకు దూరంగా ఉండండి. ఖర్చుల విషయంలో ఆచి తూచి అడుగేయాలి.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. కీలకమైన చర్చల్లో మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగులు మెరుగైన పనితీరుతో ఉన్నతాధికారుల ప్రశంసలు, పదోన్నతులు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్తారు.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో ప్రణాళికతో ముందుకు సాగితే సత్ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో స్థిరమైన ప్రగతి గోచరిస్తోంది. ఓర్పు, సహనంతో కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. ప్రతికూల ఆలోచనలు ఇబ్బంది పెట్టవచ్చు. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి.
కన్య (Virgo)
కన్య రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో శుభ యోగాలున్నాయి. అన్ని రంగాల వారు తమ తమ రంగాల్లో సులభంగా పేరు ప్రఖ్యాతలు సాధిస్తారు. వ్యాపారులకు, వారి భాగస్వాములకు మధ్య అనుకూలత ఉంటుంది. ధనధాన్య లాభాలున్నాయి. సన్నిహితులతో మంచి సమయం గడుపుతారు.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పట్టుదలతో అనుకున్నది సాధించే వరకు విశ్రమించరు. వృత్తి పరంగా ప్రయోజనం పొందుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. చేపట్టిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఒక సంఘటన విచారం కలిగిస్తుంది.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. పట్టుదల, ఏకాగ్రత ఉంటే వృత్తి వ్యాపారాల్లో సునాయాసంగా విజయం సాధించవచ్చు. కీలక వ్యవహారాల్లో ఆటంకాలు అధిగమించి ముందుకు దూసుకెళ్తారు. ఉద్యోగంలో పదవీయోగం ఉంటుంది. మీ అధికార పరిధి విస్తరిస్తుంది. స్థిరాస్తి, షేర్ మార్కెట్లో పెట్టుబడులకు దూరంగా ఉండండి.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది.అనారోగ్య సమస్యలు తీవ్రంగా బాధిస్తాయి. వృత్తి పరంగా కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. కీలక వ్యవహారాల్లో ఆచి తూచి అడుగేయండి. ఆర్థిక వ్యవహారాల్లో అజాగ్రత్త నష్టం కలిగిస్తుంది. కోపాన్ని అదుపులో పెట్టుకుంటే మంచిది.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ రోజు సరదాగా గడిచి పోతుంది. ఉద్యోగ వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో వేడుకలు, ఉత్సవాలు జరుగుతాయి. బంధు మిత్రులతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఒక ఆహ్లాదకరమైన పర్యటనకు అవకాశం ఉంది. ఆస్తి వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సరైన ప్రణాళిక, ముందు చూపుతో ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ తగ్గుతుంది. కీలక నిర్ణయాల విషయంలో తొందరపాటు నష్టం కలిగిస్తుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. కోపాన్ని అదుపు చేయకపోతే కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు రావచ్చు.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన పదోన్నతులు అందుకుంటారు. లాభాలు పెరిగి ఖర్చులు తగ్గడంతో ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. శుభవార్తలు ఉత్సాహాన్నిస్తాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ప్రియమైన వారితో విహారయాత్రలకు వెళ్తారు. ఆర్థిక లాభాలకు అవకాశం ఉంది.
