మేషం (Aries)
మేష రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారు తమ తమ రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. సంతానం పురోగతి సంతృప్తి కలిగిస్తుంది. ఉద్యోగులకు సానుకూల ఫలితాలు ఉంటాయి. స్థానచలనం ఉండవచ్చు.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. నిజాయతీ, ఆత్మ విశ్వాసంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. ఆర్థికాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో విజయాలు సాధిస్తారు.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారులు తెలివిగా, జాగ్రత్తగా పెట్టుబడి పెడితే అధిక లాభాలు ఉంటాయి. ప్రలోభాలకు లొంగకుండా జాగ్రత్త వహించండి. ఉద్యోగంలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేయండి.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారంతో వ్యాపారంలో రాణిస్తారు. సన్నిహితుల నుంచి ఆర్థికలబ్ధి ఉండవచ్చు. ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి కోసం చేసే అన్ని ప్రయత్నాలు ఫలిస్తాయి. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో ఊహించని ఆటంకాలు ఆందోళన కలిగిస్తాయి. ఉద్యోగంలో శ్రద్ధ పెంచాలి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కీలక వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. ఆర్థికంగా ఆశించిన ప్రయోజనాలు అందుకుంటారు.
కన్య (Virgo)
కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ రోజు చాలా మంచి రోజు. ఉద్యోగులు పదోన్నతులు అందుకుంటారు. వ్యాపారులకు ప్రయాణాలు అనుకూలం. వ్యాపారంలో లాభాలు గణనీయంగా పెరుగుతాయి. మానసికంగా దృఢంగా ఉంటారు.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. ఉద్యోగ వ్యాపారాల్లో అందరినీ కలుపుకొని పోవడం వలన సమస్యలుండవు. ఆర్థిక వ్యవహారాల్లో ముందుచూపుతో మెలిగితే ఖర్చులు తగ్గుతాయి.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. మీ ప్రతిభతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు. ఒక సంఘటన విచారం కలిగిస్తుంది. శత్రుభయం పొంచి ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. చేపట్టిన ప్రతీ పనిని సమర్థవంతంగా పూర్తి చేసి ప్రశంసలు అందుకుంటారు. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు పనిచేస్తాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వ్యాపారులకు ఈ రోజు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి, శ్రమ పెరగవచ్చు. కోపం అదుపులో ఉంచుకోండి. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది. అనవసర ఖర్చులు పెరుగుతాయి.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో కొన్ని పరిస్థితులు ఇబ్బంది కలిగిస్తాయి. చంచల బుద్ధితో తీసుకునే నిర్ణయాలతో నష్టం వాటిల్లుతుంది. భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవడం అవసరం. కుటుంబ సభ్యులతో వివాదాలు రాకుండా జాగ్రత్త వహించండి. ఖర్చులు పెరుగుతాయి.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ రోజు సరదాగా గడిచిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి కావడంతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ పెరగవచ్చు. ఆర్థికంగా శుభ యోగాలున్నాయి. నూతన వాహన యోగం ఉంది. ఒక శుభవార్త మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది.