Site icon vidhaatha

Lord Shiva | సోమ‌వారం శివుడిని పూజించిన త‌ర్వాత‌.. ఇది స‌మ‌ర్పిస్తే కోటీశ్వ‌రులవుతారట‌..!

Lord Shiva | హిందు ధర్మంలో శివుడికి ఎంతో ప్రత్యేకత ఉంది. తన‌ను నమ్మి భక్తి శ్రద్ధలతో పూజిస్తే రాక్షసులను కూడా అనుగ్రహించి వారు కోరిన వరాలను ప్రసాదించే బోళా శంకరుడు ఈ పరమేశ్వరుడు. అయితే ఆ మహాదేవుడిని ఎక్కువగా సోమవారం రోజు మాత్రమే పూజిస్తారు. నెవైద్యంగా ద‌ద్దోజ‌నం స‌మ‌ర్పించారు. ఇది స‌మ‌ర్పించ‌డం వ‌ల్ల ఆ భ‌క్తులు భ‌విష్య‌త్‌లో కోటీశ్వ‌రులు అవుతార‌నేది ఒక విశ్వాసం.

శివుడు ఐశ్వర్యానికి కారకుడు. మనకు ఎంత డబ్బు వచ్చిన శివుని అనుగ్రహం ఉంటేనే చేతిలో నిలుస్తుంది.
అందుకే ఎవరైనా ఆర్ధిక ఇబ్బందులతో సతమతం అవుతుంటే శివుణ్ణి ఈ విధంగా పూజిస్తే త్వరలోనే ధనవంతులు అవుతారు. ప‌ర‌మేశ్వ‌రుడిని ఎలా పూజించాలో తెలుసుకుందాం.

సోమ‌వారం తెల్ల‌వారుజామునే అభ్యంగ‌న స్నానం చేయాలి. వీలైతే శివాల‌యాల‌కు వెళ్లాలి. వీలుకాని ప‌క్షంలో ఇంట్లోనే శివుడికి పూజ‌లు చేసుకోవచ్చు. ప‌ర‌మేశ్వ‌రుడిని పువ్వులతో పూజించిన తర్వాత దద్దోజనంను నైవేద్యంగా సమర్పించాలి. దద్దోజనం అంటే పెరుగన్నంలో నేతితో పోపు పెట్టి తయారుచేయాలి. దీన్ని కనుక నైవేద్యంగా పెడితే అప్పు భాదలు ఉండవు. అలాగే డబ్బు ఇబ్బందులు తగ్గి త్వరలోనే ధనవంతులు అవుతారు.

సోమవారం అయితే దద్దోజనం నైవేద్యంగా పెడతాం. మరి మిగతా రోజుల్లో ఏమి నైవేద్యం పెట్టాలా అని ఆలోచిస్తున్నారా? మిగతా రోజుల్లో కొబ్బరికాయ, కిస్మిస్, ద్రాక్ష పండ్లు, ఎండు ఖర్జురం నైవేద్యంగా పెట్టాలి. ప్రత్యేకమైన రోజుల్లో పాలతో చేసిన పరమాన్నం లేదా పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి.

Exit mobile version