Site icon vidhaatha

సోమ‌వారం ఈ మంత్రాన్ని జ‌పిస్తే.. కోరుకున్న కోరిక‌ల‌న్నీ నెరవేరుతాయి..!

హిందూ సంప్ర‌దాయంలో సోమ‌వారానికి ఎంతో ప్ర‌త్యేక‌త ఉంది. సోమ‌వారం రోజున శివుడిని భ‌క్తులు పూజిస్తారు. ప‌ర‌మేశ్వ‌రుడిని మ‌న‌స్ఫూర్తిగా పూజిస్తే కోరిన కోరిక‌లు నెర‌వేరుతాయి. ఇక సోమ‌వారం నాడు ఉత్తరాభిముఖంగా 108 సార్లు ‘ఓం నమః శివాయ’ అనే శివ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపిస్తే శివుడు ప్రసన్నం అవుతాడని భ‌క్తుల న‌మ్మ‌కం. ఇక జీవితంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, సోమవారం నాడు శివుడిని పూజించండి.

సోమ‌వారం పొద్దున్నే అభ్యంగ‌న స్నానం చేసి శివుడిని పూజిస్తే ఎంతో పుణ్యం వ‌స్తుంది. పంచ‌దార క‌లిపిన పాల‌తో శివుడికి అభిషేకం చేస్తే ఇంకా మంచిది. అభిషేకం చేయ‌డం వ‌ల్ల ఒత్తిడి త‌గ్గి, జ్ఞానం ల‌భిస్తుంద‌ని న‌మ్మ‌కం. శారీరక వ్యాధులతో బాధపడుతుంటే సోమవారం రోజున శివునికి పంచామృతంతో అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల శివయ్య అనుగ్రహంతో రోగాల నుంచి విముక్తి లభిస్తుందని విశ్వాసం.. ఇక దరిద్రం పోయి ఆర్థిక లాభాలను పొందుతారు..

మనసులో భయం, దిగులుగా ఉంటే శివుడికి ఉత్తరాభిముఖంగా శివుని అనుగ్రహం కోసం ‘శివరక్షా స్తోత్రాన్ని’ పఠించాలి. ఇలా చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.. మనసులో భయం పోవడం మాత్రమే కాదు.. ప్రశాంతంగా ఉండాలి. ఇలా చేయడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్మకం.. డబ్బులకు డోఖా ఉండదు.

 

Exit mobile version