Vastu Tips | ఉత్త‌ర దిశ‌లో ఈ నాలుగు వ‌స్తువులు పెడితే.. ఆ ఇంట క‌న‌క వ‌ర్ష‌మే..!

Vastu Tips | ఇటీవ‌లి కాలంలో ప్ర‌తి ఒక్క‌రూ త‌మ ఇంటిని వాస్తు నియ‌మాల‌కు( Vastu Tips ) అనుగుణంగా నిర్మించుకుంటున్నారు. ఎందుకంటే భ‌విష్య‌త్‌లో ఎలాంటి మాన‌సిక‌, ఆర్థిక ఇబ్బందులు( Financial Problems ) క‌ల‌గొద్ద‌నే ఉద్దేశంతో. కానీ ఇంటిని నిర్మించుకున్న త‌ర్వాత చిన్న చిన్న పొర‌పాట్లు చేస్తుంటారు. ఇంట్లో ఉంచే వ‌స్తువుల విష‌యంలో అజాగ్ర‌త్త పాటించ‌డం వ‌ల్ల‌.. ఆర్థిక ఇబ్బందుల‌కు లోన‌వుతుంటారు. అయితే వాస్తు ప్ర‌కారం నిర్మించిన ఇంటిలో ఉత్త‌ర దిశ‌( North )లో ఈ నాలుగు వ‌స్తువులు పెడితే ఆ ఇంట క‌న‌క వ‌ర్షం కురుస్తుంద‌ని వాస్తు పండితులు( Vastu Experts ) చెబుతున్నారు.

Vastu Tips | ఇంటిని వాస్తు ప్ర‌కారం నిర్మించుకున్న‌ప్ప‌టికీ కొన్ని సంద‌ర్భాల్లో ఆ ఇంటి య‌జ‌మానిని ప్ర‌తికూల శ‌క్తులు వెంటాడుతూనే ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు( Financial Problems ) తలెత్తి ఆగ‌మాగం అవుతుంటారు. దీనికి కార‌ణం ఏంటంటే.. కొన్ని వ‌స్తువుల‌ను త‌ప్పుడు దిశ‌లో ఉంచ‌డ‌మే. వాస్తు శాస్త్రం( Vastu Tips )లో ఉత్త‌ర దిశ‌( North )కు ప్ర‌త్యేక స్థానం ఉంది. ఈ దిశ ధనానికి అధిపతి అయిన కుబేరుడికి ప్రీతిపాత్రమైనది. కాబట్టి, కుబేరుడి అనుగ్రహం లభించి, మీరు ఆర్థికంగా బలపడాలంటే, ఇంటి ఉత్తర దిశలో తప్పనిసరిగా ఈ నాలుగు వస్తువులను ఉత్తర దిక్కులో ఉంచితే ఆర్థిక అదృష్టం తప్పక వరిస్తుంది. మ‌రి నాలుగు శుభప్రదమైన వస్తువుల గురించి తెలుసుకుందాం.

1. కుబేరుడి విగ్రహం లేదా యంత్రం

ధ‌నానికి అధిప‌తిగా భావించే కుబేరుడి విగ్రహాన్ని లేదా కుబేర యంత్రాన్ని ఇంటి ఉత్తర దిశలో ఏర్పాటు చేయడం అత్యంత శుభప్రదమ‌ని వాస్తు పండితులు చెబుతున్నారు. ఈ దిశలో కుబేరుడిని ప్రతిష్టించడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. దీంతో కుటుంబ సభ్యుల మధ్య సంతోషం నెలకొని, ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోతుంది. క్రమం తప్పకుండా ఆరాధించడం ద్వారా ధనానికి ఏనాడూ లోటు రాదు అని పండితులు పేర్కొంటున్నారు.

2. అక్వేరియం

ఇంట్లోని ఉత్తర దిశలో అక్వేరియం ఉంటే అత్యుత్తమ ఫలితాలు వస్తాయి. అక్వేరియంలోని చేపలు చురుకుదనం, నిరంతర కదలికను సూచిస్తాయి. ముఖ్యంగా, తొమ్మిది చేపలు ఉండే అక్వేరియం పెడితే మరింత శుభ ఫలితాలను ఇస్తుంది (సాధారణంగా ఎనిమిది గోల్డ్ ఫిష్, ఒక బ్లాక్ ఫిష్). దీని వల్ల ఉద్యోగులకు ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం లభిస్తుంది. వ్యాపారస్తులు ఆర్థికంగా బలపడతారు. నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం ఇక్కడ చాలా ముఖ్యం

3. బీరువా

మీరు ధనం, ఆభరణాలు, ముఖ్యమైన పత్రాలు ఉంచే బీరువా లేదా సేఫ్‌ను ఉత్తర దిశలో ఉండేలా చూసుకోవాలి. ఇది కేవలం బీరువా పెట్టే స్థలమే కాదు, అది తెరిచినప్పుడు ఉత్తరం వైపునకు (కుబేరుడి దిశకు) తెరుచుకునేలా ఉండాలి. ఇలా చేయడం వల్ల కుబేరుడి ఆశీస్సులు లభించి, ఆర్థిక నష్టాలు జరగవు. ఇంట్లో ధన ప్రవాహం స్థిరంగా కొనసాగుతుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

4. వాటర్ ఫౌంటెన్ లేదా నీటి పాత్ర

వాస్తులో నీటికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రవహించే నీరు ధన ప్రవాహాన్ని సూచిస్తుంది. కాబట్టి, ఒక చిన్న వాటర్ ఫౌంటెన్‌ను లేదా ఒక శుభ్రమైన నీటి కుండను ఉత్తర దిశలో ఉంచాలి. ఇది నిరంతరం ఇంట్లోకి సానుకూల శక్తిని తీసుకువస్తుంది. ఫౌంటెన్ కుదరకపోతే, నీటిని శుభ్రం చేసే యంత్రం (వాటర్ ఫ్యూరిఫైయర్) లేదా కొద్దిగా నీటిని నిల్వ చేసే ఏదైనా పాత్రను ఉంచడం మంచిది. ఇది కష్టాలను దూరం చేసి, ఆరోగ్యం బాగుండేలా చేస్తుంది.