Ravi Pushya Yoga 2025 | జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రెండు శక్తివంతమైన యోగాలు ఉంటాయి. అందులో ఒకటి గురు పుష్య యోగం( Guru Pushya Yoga ) కాగా మరొకటి రవి పుష్య యోగం( Ravi Pushya Yoga ). ఇక గురువారం పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తే గురు పుష్యయోగంగా పిలుస్తారు. అదే, ఆదివారం పుష్యమి నక్షత్రంలో కలిసి వస్తే ఆ రోజును రవి పుష్య యోగంగా భావిస్తారు. కాబట్టి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రెండు యోగాలు కూడా చాలా పవిత్రమైన శుభ దినాలుగా హిందువులు( Hindus ) భావిస్తారు. అలాంటి బ్రహ్మాండమైన ముహూర్తం కలిగిన ఈ యోగాలలో ఒకటైన రవి పుష్య యోగం ఈ ఏడాది మే 4వ తేదీ అంటే ఆదివారం( Sunday ) రోజు వస్తోంది. ఆదివారం రోజు కొన్ని పరిహారాలు చేస్తే పట్టిందల్లా బంగారమే( Gold ) అవుతుంది. సొంతింటి కల కూడా తప్పకుండా నెరవేరుతుంది. మరి, ఈ సందర్భంగా ఎలాంటి విధివిధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ మత విశ్వాసాల ప్రకారం.. రవి పుష్య నక్షత్రానికి చాలా ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఉంది. మే 4, ఆదివారం రవి పుష్య యోగం వచ్చింది. గృహ యోగాన్ని త్వరగా సిద్ధింప చేసుకోవడానికీ గురు పుష్య, రవి పుష్య యోగాలు చాలా బాగా సహకరిస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
ఆదివారం ఇలా చేస్తే సొంతింటి కల సాకారం..!
ఎవరికైనా జన్మ జాతకంలో నాలుగో స్థానాన్ని గృహ స్థానం అంటారు. ఆ నాలుగో స్థానంలో ఎవరికైనా పాప గ్రహాలు ఉన్నట్లయితే సొంతింటి కల నెరవేరదట. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇల్లు కొనుక్కోవడం గానీ, కట్టుకోవడం గానీ జరగదట. ఒకవేళ ఇల్లు కట్టుకున్నా కూడా కిరాయి ఇళ్లల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందట. అలాంటి సందర్భాల్లో రవి పుష్య యోగం రోజు ఈ చిన్న పరిహారం చేస్తే సొంతింటి కల సాకారం చేసుకోవడంతో పాటు ఎక్కువ సంవత్సరాలు సొంతింట్లో ఉండే యోగం కూడా కలుగుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
మరి చేయాల్సిన ఆ పరిహారం ఏంటి..?
రవిపుష్య యోగం మే 4 ఆదివారం రోజు ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో మీ చేతితో 11 రాగి మొక్కలను నాటండి. ఆపై వాటికి నీళ్లను పోయండి. ఇలా చేస్తే మీ జాతకంలో చతుర్థ స్థానంలో ఉన్న పాప గ్రహాల వల్ల ఇంటి సంబంధమైన సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయట. అయితే, రావి మొక్కలు అందుబాటులో లేని వారు 11 మేడి మొక్కలైనా నాటవచ్చు. ఈ రెండింట్లో ఏది చేసినా శుభ ఫలితాలు కలిగి తొందరలోనే గృహ యోగం కలుగుతుందట. ఇల్లు మారాలనుకునేవారు రవి పుష్యయోగం రోజున మారితే చాలా మంచిదట. అదృష్టం కూడా కలిసివస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
బంగారం కొనుగోలు చేస్తే డబుల్..!
అలాగే, కొత్త వస్తువులు కొనుగోలు చేయడానికి, అందులోనూ ముఖ్యంగా బంగారాన్ని కొనడానికి రవి పుష్య నక్షత్ర సమయం మంచి అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చంటున్నారు. రవి పుష్య యోగం రోజు బంగారం కొనుగోలు చేస్తే చాలా మంచిది. అంతేకాదు, ఈరోజు బంగారం కొనుగోలు చేస్తే రెట్టింపు ఫలితాలు రావడానికీ ఆస్కారం ఉంటుందంటున్నారు మాచిరాజు.