Aparajita Flower | ఆ పూల‌తో ల‌క్ష్మీదేవిని పూజిస్తే.. ధ‌నానికి లోటుండ‌ద‌ట‌..! మ‌రి ఇంట్లో ఆ పూల మొక్క‌ను పెంచుకోవ‌చ్చా..?

Aparajita Flower | అప్పులు, ఆర్థిక క‌ష్టాల‌తో బాధ‌ప‌డేవారు అపరాజిత మొక్క‌ను స‌రైన దిశ‌లో పెంచుకుంటే ఆ ఇంట ల‌క్ష్మీదేవి నివ‌సిస్తుంద‌ని న‌మ్మ‌కం. అపరాజిత మొక్క అంటే శంఖ పుష్పం మొక్క. ఎవరైనా తీవ్రమైన ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటే శంఖ పుష్పం మొక్కను పెంచుకొని ఆ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఆర్థిక సమస్యలు దూరమవుతాయి.

  • Publish Date - June 13, 2024 / 07:18 AM IST

Aparajita Flower | చాలా మంది రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డుతుంటారు. కానీ ధ‌నం స‌మ‌కూర‌దు. చేసిన క‌ష్టం వృధా అవుతుంటుంది. నిత్యం అప్పులు చేస్తూ ఆందోళ‌న‌కు గుర‌వుతుంటారు. అలాంటి వారు దేవుళ్ల‌ను న‌మ్ముకుంటుంటారు. మీరే త‌న‌ను ఆర్థిక క‌ష్టాల నుంచి గట్టెక్కించాల‌ని ప్రార్థిస్తుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్ర‌కారం అప్పులు, ఆర్థిక క‌ష్టాల‌తో బాధ‌ప‌డేవారు అపరాజిత మొక్క‌ను స‌రైన దిశ‌లో పెంచుకుంటే ఆ ఇంట ల‌క్ష్మీదేవి నివ‌సిస్తుంద‌ని న‌మ్మ‌కం. అపరాజిత మొక్క అంటే శంఖ పుష్పం మొక్క. ఎవరైనా తీవ్రమైన ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటే శంఖ పుష్పం మొక్కను పెంచుకొని ఆ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. ఇక జీవితంలో ధనానికి లోటుండదు అని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

ఇంట్లో ఏ దిశ‌లో పెంచుకోవాలి..?

వాస్తు శాస్త్రం ప్రకారం శంఖ పుష్పం మొక్కను నాటేటప్పుడు సరైన దిశలో నాటాలి. లేకపోతే వ్యతిరేక ఫలితాలు వచ్చే ప్రమాదముంది. ఇంటికి కుబేర స్థానమైన ఈశాన్య దిశలో గణేశుడు, లక్ష్మీదేవి, కుబేరుడు నివసిస్తారని వాస్తు చెబుతోంది. అందుచేత అపరాజిత మొక్కను ఇంటికి తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య మూలలో నాటడం శుభప్రదం. శంఖ పుష్పం మొక్కను ఇంటికి దక్షిణం లేదా పడమర దిశలో ఎప్పుడూ నాటకూడదు. అలా నాటితే ప్రతికూల ఫలితాలు వస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.

మ‌రి ఏ రోజు నాటితే మంచిది..?

వాస్తు ప్రకారం గురువారం విష్ణుమూర్తికి, శుక్రవారం లక్ష్మీదేవికి అంకితమని అంటారు. అందుకే గురువారం లేదా శుక్రవారం ఇంట్లో అపరాజిత మొక్కను నాటడం శుభప్రదం. మొక్కే కదా అని తేలిగ్గా తీసుకోకుండా శంఖ పుష్పం మొక్కను నాటుదాం. శుభ ఫలితాలను పొందుదాం. శంఖ పుష్పం మొక్క ఇంట్లో ఉంటే శాంతి, ఐశ్వర్యం, ఆనందం, సకల శ్రేయస్సులు ఉంటాయి. ఆ పూలతో ప్రతిరోజూ శివుని, వేంకటేశ్వర స్వామిని, ఆంజనేయ స్వామిని పూజిస్తే ఏలినాటి శని దోషాలు పోతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. అందుకే జాతకంలో శని దోషం ఉన్నవారు శని దోష ప్రభావాన్ని తగ్గించడానికి ఇంట్లో అపరాజిత మొక్కను పెంచుకుంటారు.

Latest News