Zodiac Signs | 2026 ఫిబ్రవరి 23వ తేదీన కుజ గ్రహం( Mars ) శని రాశి అయినా కుంభ రాశి (Aquarius)లోకి ప్రవేశించనున్నట్లు జ్యోతిష్య పండితులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీ వరకు కూడా కుజ గ్రహం అక్కడే సంచారం చేయనుంది. ఇప్పటికే ఆ రాశిలో సంచరిస్తున్న రాహువు.. డిసెంబర్ 5 వరకు అదే రాశిలో ఉంటాడు. ఇప్పుడు కుజగ్రహం సంచారం వలన రెండు గ్రహాల కలయిక అనేది ఒక విస్ఫోటక సమస్యను సృష్టిస్తుంది. ఈ ప్రభావం మూడు రాశుల( zodiac Signs )పై అధికంగా చూపుతుంది. ఈ మూడు రాశుల వారు ఫిబ్రవరి( February ) నెలలో ఘోరమైన కష్టాలు అనుభవించాల్సి వస్తుందని జ్యోతిష్య పండితులు హెచ్చరిస్తున్నారు. మరి ఆ మూడు రాశులు ఏంటంటే..?
మేషం (Aries)
ఫిబ్రవరి నెలలో మేష రాశి వారు చాలా అప్రమత్తంగా ఉండాలి. రెండు గ్రహాల కలయిక కారణంగా అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి నెలలో చేపట్టే ప్రతి పనిలో ఆటంకాలు ఎదురై.. ఉక్కిరిబిక్కిరి అయ్యే అవకాశం ఉందని పండితులు హెచ్చరిస్తున్నారు.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి కుజ గ్రహం, రాహు గ్రహం కలయిక వలన ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు అధికం అవుతాయి. కుటుంబంలో కలహాలు ఎక్కువ అవ్వడం, ఆర్థిక ఇబ్బందులు చాలా ఇబ్బందులకు గురి చేస్తాయి. ఈ సమయంలో వీరు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవడం అవసరం. అలాగే ఈ రాశి వారు భాగస్వామ్య వ్యాపారం చేయడం మంచిది కాదు. పెట్టుబడులు పెట్టడం వలన కూడా నష్టపోయే ఛాన్స్ ఎక్కువగా ఉన్నది కాబట్టి, జాగ్రత్త అవసరం అని పండితులు హెచ్చరిస్తున్నారు.
మకరం (Capricorn)
కుజ, రాహు గ్రహాల కలయిక కారణంగా ఈ రాశి వారు ఆర్థిక నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారు ఊహించని విధంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఉద్యోగస్తులకు కలిసిరాదు.. వారి కష్టమంతా వృథా అయ్యే అవకాశం ఉంది. ఆర్థిక కష్టాలు, అనారోగ్య సమస్యలతో సతమతమయ్యే అవకాశం ఉంది. అంటే మొత్తానికి ఈ రాశి వారికి శ్రమకు తగిన ప్రతిఫలం లభించే అవకాశం లేదని పండితులు చెబుతున్నారు.
