IRCTC Best Package: రూ. 11820కే మధ్యప్రదేశ్ జ్యోతిర్లింగా దర్శనం

ఐఆర్‌సీటీసీ కేవలం ₹11820కే భోపాల్–ఉజ్జైన్–ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగా దర్శన యాత్ర. 5 రాత్రులు, 6 రోజుల ప్యాకేజీతో ఆధ్యాత్మిక ప్రదేశాల సందర్శన అవకాశం.

RCTC Madhya Pradesh Jyotirlinga Darshan tour package

మన దేశానికి గుండెగా చెప్పుకునే మధ్యప్రదేశ్ రాష్ట్రం పురాణాలు, పురాతన సంప్రదాయాలు, ఆధ్యాత్మిక వైభవంతో కూడిన ప్రదేశం. మధ్యప్రదేశ్‌లో ఉన్న అనేక పవిత్ర ప్రదేశాలలో శివాలయాలు, జ్యోతిర్లింగాలు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి శివుని ఆలయాల కట్టడాలు మంత్ర ముగ్ధుల్ని చేస్తాయి. శతాబ్దాల నాటి ఇతిహాసాలు, ఆధ్యాత్మిక తత్వాన్ని ఎంతగానో పెంపొందిస్తాయి. అంతటి మహిమ ఉన్న మధ్యప్రదేశ్‌లోని జ్యోతిర్లింగాలను దర్శించుకునేందుకు IRCTC తక్కువ ధరకే మంచి ప్యాకేజీని తీసుకువచ్చింది. ‘మధ్యప్రదేశ్ జ్యోతిర్లింగా దర్శనం’ పేరుతో కేవలం రూ. 11820కే భోపాల్, ఉజ్జయిన్, ఓంకారేశ్వర్, ఇండోర్ ప్రాంతాలను చూపించేందుకు సిద్ధమైంది. ఈ యాత్ర ఈ నెల 26న ప్రారంభం అవుతుండగా, పూర్తిగా 5 రాత్రులు, 6 రోజుల పాటు సాగుతుంది.

యాత్ర పూర్తి వివరాలు: మొదటి రోజు అంటే 26 తేదిన కాచిగూడ రైల్వే స్టేషన్‌ నుంచి సాయంత్రం 04.30 గంటలకు సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలు బయలుదేరుతుంది. రాత్రంతా ప్రాయణం చేస్తారు. మరుసటి రోజు ఉదయం 08.15 గంటలకు భోపాల్‌ చేరుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12 గంటలకు హోటల్‌కు చేరుకుంటారు. అక్కడ ఫ్రెష్‌అప్ అయ్యాక సాంచి స్థూపాన్ని సందర్శిస్తారు. తర్వాత భోజేశ్వర్ మహాదేవ్ టెంపుల్ దర్శించుకుని తిరిగి భోపాల్ వెళ్తారు. అక్కడ ట్రైబల్ మ్యూజియం చూసి హోటల్‌లో బస చేస్తారు.

మూడవ రోజు ఉదయం హోటల్‌లోనే బ్రేక్‌ఫాస్ట్ ముగించుకుని 200 కి.మీ దూరంలో ఉన్న ఉజ్జయిన్‌కు వెళ్తారు. అక్కడ హోటల్‌లో చెక్ ఇన్ అయ్యాక. స్థానికంగా ఉన్న ఆలయాలను దర్శిస్తారు. శ్రీ మహాకాళేశ్వర్ ఆలయం, హర్‌సిద్ధి ఆలయం, మంగళనాథ్ ఆలయం, నవగ్రహ శని మందిర్, శ్రీ చింతం గణేశ్ ఆలయం, రామ్ ఘాట్, శ్రీ గధ కాళిక ఆలయం, ఉజ్జయిన్ దర్శించుకుని రాత్రికి ఉజ్జయిన్‌లోనే బస చేస్తారు.

నాలుగవ రోజు ఉదయం హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ ముగించుకుని 165 కి.మీ దూరంలో ఉన్న హహేశ్వర్‌ బయలుదేరుతారు. అక్కడ అహల్య దేవి కోట, నర్మదా ఘాట్ చూశాక అక్కడి నుంచి ఓంకారేశ్వర్ వెళ్లి అక్కడ హోటల్‌లో చెక్ ఇన్ అవుతారు. అక్కడి నుంచి నడుచుకుంటూ లేదా పడవలో నది దాటి మహాకాళేశ్వర్ ఆలయాన్ని దర్శించుకుంటారు. రాత్రికి ఓంకారేశ్వర్‌లోనే బస చేస్తారు.

ఐదవ రోజు ఉదయం అల్పహారం ఆరగించి హోటల్ నుంచి బయలుదేరుతారు. 70 కి.మీ దూరంలో ఉన్న ఇండోర్ చేరుకుంటారు. అక్కడ లాల్ బాగ్ ప్యాలెస్, ఖజ్‌రానా గణేశ్ మందిర్ దర్శించుకున్నాక సాయంత్రం ఇండోర్ రైల్వే స్టేషన్‌ చేరుకుంటారు. రాత్రి 8.37 గంటలకు ట్రైన్ నెంబర్: 19301 ఎక్కేస్తారు. రాత్రి, పగలు ప్రయాణం తిరిగి ఆరవ రోజు రాత్రి 10 గంటలకు కాచిగూడ చేరుకుంటారు.

టికెట్ ధరలు: ఈ యాత్రలో కంఫర్ట్, స్టాండర్డ్ రెండు రకాలు ఉంటాయి. కంఫర్ట్ అయితే రైల్లో 3ఏసీ టికెట్, హోటల్‌లో ఏసీ గది, స్టాండర్డ్ అయితే స్లీపర్ టికెట్ , హోటల్‌లో నాన్ ఏసీ గదులు ఉంటాయి. ఈ యాత్రకు ఒక్కరు మాత్రమే వెళ్లాలి అనుకుంటే కంఫర్ట్ రూ. 36190, స్టాండర్డ్ రూ.33680 చొప్పున చెల్లించాలి. ఇద్దరు కలిసి వెళ్తే ఒక్కొక్కరు కంఫర్ట్ రూ. 20360, స్టాండర్డ్ 17850 చొప్పున చెల్లించాలి. అదే ముగ్గురు కలిసి వెళ్తే మాత్రం ఒక్కొక్కరు కంఫర్ట్ రూ.15880, స్టాండర్డ్ రూ.13380 చొప్పున ఉంటుంది. అదే నలుగురి నుంచి ఆరుగురు వెళ్తే మాత్రం ఇద్దరి చొప్పున ఒక్కొ గది తీసుకుంటే కంఫర్ట్ రూ.16730, స్టాండర్డ్ రూ.14220, ఒకవేళ ముగ్గురు చొప్పున ఒక్కో గది తీసుకుంటే మాత్రం కంఫర్ట్ రూ.14330, స్టాండర్డ్ రూ.11820 చొప్పున పడుతుంది. 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలు ఉంటే వారికి విత్ బెడ్ కంఫర్ట్ అయితే రూ.12010, వితౌట్ బెడ్ రూ. 10110. స్టాండర్డ్ అయితే విత్ బెడ్ రూ.9500, వితౌట్ బెడ్ రూ. 7600 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

నోట్ : మరింత సమాచారం కోసం IRCTC వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.

Latest News