రోజుకో రంగు దుస్తులు ధ‌రించండి..! ఆ దేవుళ్ల అనుగ్ర‌హం పొందండి..!

ఏడు రోజుల‌ పాటు వేర్వేరు దేవుళ్ల‌ను పూజిస్తారు. ఈ ఏడు రోజుల‌కున్న విశిష్ట‌త మాదిరిగానే ప్ర‌తీ రోజు ఒక రంగుకు విశిష్ట‌త ఉంది. ఇలా రోజుకో రంగు దుస్తులు ధ‌రించి, దేవుళ్ల అనుగ్ర‌హం పొందొచ్చు అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు

  • Publish Date - April 8, 2024 / 07:05 AM IST

ఏడు రోజుల‌ పాటు వేర్వేరు దేవుళ్ల‌ను పూజిస్తారు. ఈ ఏడు రోజుల‌కున్న విశిష్ట‌త మాదిరిగానే ప్ర‌తీ రోజు ఒక రంగుకు విశిష్ట‌త ఉంది. ఇలా రోజుకో రంగు దుస్తులు ధ‌రించి, దేవుళ్ల అనుగ్ర‌హం పొందొచ్చు అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

హిందువులు ఎంతో భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో త‌మ‌కు ఇష్ట‌మైన దేవుళ్ల‌ను పూజిస్తారు. ప్ర‌తి రోజు ఆల‌యాల‌కు వెళ్లి ప్ర‌త్యేక పూజ‌లు చేస్తుంటారు. మొక్కులు స‌మ‌ర్పించుకుంటుంటారు. కోరిక‌లు కూడా కోరుతుంటారు. దేవుళ్ల‌కు ఇష్ట‌మైన నైవేద్యాలు కూడా స‌మ‌ర్పిస్తుంటారు. ఏడు రోజుల‌ పాటు వేర్వేరు దేవుళ్ల‌ను పూజిస్తారు. ఈ ఏడు రోజుల‌కున్న విశిష్ట‌త మాదిరిగానే ప్ర‌తీ రోజు ఒక రంగుకు విశిష్ట‌త ఉంది. ఇలా రోజుకో రంగు దుస్తులు ధ‌రించి, దేవుళ్ల అనుగ్ర‌హం పొందొచ్చు అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మ‌రి ఏ దేవుడికి ఏ రంగు ఇష్ట‌మో తెలుసుకుందాం..

ప‌ర‌మ‌శివుడికి తెలుపు రంగు పూలంటే ఇష్టం. కాబ‌ట్టి సోమ‌వారం రోజు తెల్ల‌ని దుస్తులు ధ‌రించి పూజ‌లు చేస్తే ఫ‌లితం ఉంటుంద‌ని విశ్వాసం. తెలుపు రంగు దుస్తులు లేక‌పోతే నీలి రంగు దుస్తులు కూడా ధ‌రించొచ్చు.

మంగ‌ళ‌వారం ఆంజనేయుడిని ఆరాధిస్తారు. హ‌నుమంతుడికి సింధూరం రంగు అంటే ఇష్టం. కాబ‌ట్టి మంగ‌ళ‌వారం సింధూరం క‌ల‌ర్‌లో ఉండే ధ‌రించి పూజ‌లు చేస్తే ఫ‌లితం ఉంటుందనేది న‌మ్మ‌కం.

బుధ‌వారం వినాయ‌కుడిని పూజ‌లు చేస్తారు. విఘ్నేశ్వ‌రుడి పూజ‌లో పాల్గొనేవారు ఆకుప‌చ్చ రంగు దుస్తులు ధ‌రిస్తే మంచిది.

విష్ణువును గురువారం పూజిస్తారు. కాబ‌ట్టి ఆ రోజున ప‌సుపు లేదా నారింజ రంగు దుస్తులు ధ‌రించాలి.

శుక్రవారం రోజు ఆది శక్తికి అంకితం. ఈ రోజు ముదురు ఎరుపు రంగు దుస్తులు లేదా గులాబీ రంగు దుస్తులు ధరించాలి.

శనివారం శనిదేవుడి వారం. ఈ రోజు తప్పకుండా నలుపు రంగు దుస్తులు ధరించాలి. శనిదేవుడికి నలుపు అంటే ఇష్టం.

ఆదివారం రోజు పసుపు రంగు దుస్తులు ధరించాలి. అదివారం సూర్యుడికి అంకితం.

Latest News