Site icon vidhaatha

Sri Rama Navami | శ్రీరామనవమి రోజున సీతారాముల కల్యాణం జరగలేదా..? ఎప్పుడు జరిగిందో తెలుసా..?

Sri Rama Navami | మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్రమూర్తి పుట్టిన రోజే శ్రీరామనవమి. దేవతలను, మనుషులను పట్టిపీడిస్తున్న రాక్షసులను సంహరించేందుకు విమూర్తి ఎత్తిన అవతారాల్లో శ్రీరాముడి అవతారం ఒకటి. దశరథుడు, కౌసల్య దేవిలకు చైత్రశుద్ధ నవమి గురువారం మధ్యాహ్నం కర్కాటక లగ్నంలో అభిజిత్‌ ముహూర్తంలో 12 గంటలకు శ్రీరాముడు జన్మించారు. శ్రీరాముడు ఆ తర్వాత విద్యాభ్యాసం పూర్తి చేశారు. కోసం విశ్వామిత్ర మహర్షిక కోరిక మేరకు యాగ రక్షణ కోసం వెళ్లి రాక్షసులను సంహరించారు. అనంతరం జనకమహారాజు సీతమ్మ వారి వివాహం కోసం ఏర్పాటు చేసిన స్వయంవరానికి వెళ్లి శివధనస్సును ఎక్కుపెట్టారు. ఆ తర్వాత సీతమ్మవారిని వివాహమాడారు. అయితే, ఆ తర్వాత 14 సంవత్సరాల అరణ్యవాసం, సీతాపహరణం, లంకలో రావణ సంహారం అనంతరం అయోధ్యలో శ్రీరాముడు సీతాసమేతంగా అడుగుపెట్టాడు. అయితే, శుభ సంఘటన జరిగింది సైతం చైత్రశుద్ధ నవమి రోజునేనని భక్తుల విశ్వాసం.

అయితే, సీతారాముల కల్యాణం శ్రీరామనవమి రోజున జరుగలేదు. వాల్మీకి రామాయణం ప్రకారం.. మార్గశిర మాసం శుక్లపక్షం పంచమి రోజున సీతారాముల కల్యాణ వేడుక జరిగింది. అందుకే జనకుడి రాజ్యమైన ప్రస్తుతం నేపాల్‌లోని జనకుర్సి ప్రాంతంలో ఇప్పటికీ మార్గశిర మాసంలోనే సీతారాముల కల్యాణం జరిపిస్తుంటారు. వేదకాలం నుంచే మిథిలారాజ్యం ఉండేదని చారిత్రకారులు పేర్కొంటున్నారు. ఈ రాజ్యాన్ని విదేహ రాజ్యంగా కూడా పిలుచుకునేవారు. ఆ పేరుమీదనే వైదేహి అన్న పేరు సీతమ్మవారికి వచ్చింది. జనకుడి రాజధానే ఇప్పటి నేపాల్‌ రాజధాని జనక్‌పురి అని ప్రజల నమ్మకం. ఇక్కడే భూమిని దున్నుతుండగానే సీతమ్మ వారు కనిపించిందని చెబుతుంటారు. సీతమ్మ తల్లి పెరిగి పెద్దదయ్యిందీ.. శ్రీరాముడితో కల్యాణం జరిగింది ఈ నగరంలోనేనని విశ్వసిస్తారు. దాంతో పాటు భూటాన్‌లోనూ మార్గశిర శుద్ధ పంచమి రోజునే రాములవారి కల్యాణాన్ని నిర్వహిస్తారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని ఒంటిమిట్టలో మాత్రం చైత్ర మాస పూర్ణిమ రోజున రాత్రివేళ కల్యాణ నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.

Exit mobile version