Sri Ramanavami | శ్రీరామనవమి రోజున ఈ పనులు అస్సలు చేయొద్దు..!

Sri Ramanavami | శ్రీమన్నారాయణుడు నరుడిగా అవతరించిన రోజే శ్రీరామనమి. చైత్ర శుద్ధ నవమి రోజున అభిజిత్‌ ముహూర్తంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆయన జన్మించారు. ఈ రోజున తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్‌ దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలను వైభవంగా జరుగనున్నాయి. ఊరూరా సీతారాముల కల్యాణోత్సవాలు జరుగనున్నాయి. ఈ ఏడాది శ్రీరామ నవమిని ఈ నెల 17న జరుపుకోనున్నాం. అయితే, శ్రీరామ నవమి రోజున పాటించాల్సిన పలు పూజా నియమాలున్నాయి. పొరపాటున కూడా తప్పులను చేయకూడదు. శ్రీరామనవమి రోజున ఎట్టి పరిస్థితిల్లో మద్యంతో పాటు మాంసం కూడా ముట్టుకోకూడదు.

  • Publish Date - April 17, 2024 / 07:30 AM IST

పండుగ రోజున తయారు చేసుకునే వంటల్లో అల్లం వెల్లుల్లిని ఉపయోగించూడదు. తీసుకోకూడదు. పండుగ రోజున జుట్టు కత్తిరించుకోవడం అశుభమని వేదపండితులు పేర్కొంటున్నారు. అందుకే జుట్టును కత్తిరించకూడదు. శ్రీరాముడిని కొలిచే ఈ రోజున ఇతరులను దూషించకూడద.. అబద్ధాలు సైతం ఆడకూడదు. జీవిత భాగస్వామితో కూడా అబద్ధాలు చెప్పకూడదు. ఇతరులను మోసం చేసేలా ఏ పనీ చేయకూడదు. వీలైనంతవరకూ ప్రతి ఒక్కరితోనూ సంతోషంగా మాట్లాడేందుకు ప్రయత్నించారు. శ్రీరామనవమి రోజున వీలైతే రామచరిత మానస, రామ చాలీసా పారాయణం చేయాలి. ‘ఓం శ్రీ రామయః నమః.. శ్రీ రామ జయ రామ జయ జయ రామ.. ఓం దశరథ తనయాయ విద్మహే.. సీతావల్లభయ ధిమాహీ తనో రామ ప్రచోదాయత్’ అనే మంత్రాన్ని జపిస్తూ శ్రీ రామ నవమి రోజున శ్రీ రాముడిని పూజించాలి. దాంతో ఆయన అనుగ్రహం లభిస్తుంది. ఆ రోజున ఉపవాసం ఆచరించడం ద్వారా సుఖం, శ్రేయస్సు కలిగి పాపాలు నశిస్తాయి. శ్రీ రాముడు మధ్యాహ్న సమయంలో జన్మించాడు కాబట్టి, ఈ సమయంలో రామ నవమి పూజ చేయడం మంచిది.

శ్రీరాముడిని పూజించే సమయంలో ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగించాలి. స్వామివారిని తులసీమాలలతో అలంకరించాలి. పూజ కృతువు పూర్తయ్యాక శక్తిమేరకు పేదలకు అన్నదానం చేయడం వల్ల పుణ్యం ప్రాప్తిస్తుంది. నవమి రోజున ముత్తయిదువలకు తాంబూలం ఇవ్వడం సైతం ఆనవాయితీగా వస్తున్నది. నవమి రోజున అర్చనలు, నిర్దిష్ట పూజలు చేసుకోవచ్చు. వీటన్నింటిని ఏకకాలంలో నామ జపం, మంత్రాలు, శ్లోక పఠనంతో అనుసరించాలి. స్వామివారికి తలంబ్రాలు పడిన తర్వాతనే మధ్యాహ్నం భోజనం చేయాలి. వీలు చేసుకొని దగ్గరలో ఉన్న రామాలయానికి వెళ్లి సీతారాముల కల్యాణ వేడుకలను చూడడం మంచిది.

Latest News