Site icon vidhaatha

Vastu Tips | మీ ఇంట్లో న‌ల్లా లీక్ అవుతోందా..? అయితే మీ చేతిలో చిల్లి గ‌వ్వ కూడా మిగ‌ల‌దు..!

Vastu Tips | ఇల్లు నిర్మించుకునే ప్ర‌తి ఒక్క‌రూ వాస్తు నియ‌మాలు పాటిస్తారు. ఏ దిశ‌లో ప్ర‌ధాన ద్వారం ఉండాలి..? ఏ దిశ‌లో హాలు, వంట గ‌ది, బాత్రూమ్, బాల్కానీ, ఇత‌ర‌త్రా ఉండాల‌నే విష‌యాల‌పై దృష్టి సారిస్తారు. వాస్తు నిపుణుడి సూచ‌న‌ల మేర‌కు ఆ కొత్తింటికి వాస్తు దోషం లేకుండా నిర్మించుకుంటారు. అయితే న‌ల్లాల విష‌యంలో కూడా వాస్తు నియ‌మాలు పాటించాల్సిందే. ఇంట్లో ఎక్క‌డ న‌ల్లా పెడితే బాగుంటుందో కూడా ఆలోచించాలి. ఆ నల్లాల నుంచి నిరంత‌రం నీళ్లు లీక్ అవుతుంటే, ఆ ఇంట్లో ఆర్థిక క‌ష్టాలు ఉంటాయ‌ని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మనం ఎంత సంపాదించినా కూడా చేతిలో చిల్లిగవ్వ మిగలదు. కష్టపడి సంపాదించిన ప్రతి పైసా నీళ్లలా ఖర్చు అవుతుంది. అంతేకాదు ఇంట్లో మనశ్శాంతి కూడా కరువవుతుంది. అనారోగ్య సమస్యలు వేధిస్తుంటాయని పేర్కొంటున్నారు.

కాబ‌ట్టి ఇంట్లో నల్లా లీక్ అవుతుంటే.. వెంట‌నే రిపేర్ చేయించ‌డం మంచిది. మ‌రి ముఖ్యంగా మీ వంటగదిలో కుళాయి నుంచి నీళ్లు కారుతుంటే వాస్తు పరంగా అది అస్సలు మంచిది కాదట. వంటగదిని అగ్నిదేవుడితో సమానంగా చూస్తారు హిందూవులు. కాబ‌ట్టి అగ్ని, నీరు రెండు కలిసి ఉన్న చోట సమస్యలు మొదలవుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆ కుటుంబంలో అనారోగ్య స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మ‌వుతాయ‌ని, వ్యాపారంలో న‌ష్టాలు వ‌స్తాయ‌ని న‌మ్ముతుంటారు. నీటిని వృథా చేయ‌డం వ‌ల్ల ఆ ఇంట్లో ప్ర‌తికూల వాతావ‌ర‌ణం కూడా ఏర్ప‌డుతుంద‌ట‌. ఇలాంటి సమస్యలన్నింటిని నుంచి బయటపడాలంటే వీలైనంత త్వరగా ఇంట్లో ట్యాప్ లను మరమ్మత్తు చేయించడం మంచిది.

ఏ దిశ‌లో న‌ల్లా ఉండాలి..?

వాస్తు శాస్త్రం ప్ర‌కారం ఏ దిశ‌లో న‌ల్లా ఉంటే మంచిదో తెలుసుకుందాం. మ‌న‌కు న‌చ్చిన‌ట్టు న‌ల్లా ఏర్పాటు చేస్తే ఆ ఇంట్లో ప్ర‌తికూల ప‌రిస్థితులు ఎదుర‌వుతాయ‌ని చెబుతున్నారు. వాటర్ ట్యాంక్ లేదా దానికి సంబంధించిన ఏదైనా సరే అమర్చడానికి..ఇంట్లో సరైన దిశలోనే ఏర్పాటు చేయాలి. నీటి కుళాయి కానీ ట్యాంకు కానీ ఈశాన్య దిశలోనే ఉండాలి. ఈ దిశలో ఉంటే ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి..ఆ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగ్గా ఉంటుంది. వాస్తు ప్రకారం ఇంట్లో కుళాయి నుంచి నీరు కారడం చంద్రుని బలహీనతను సూచిస్తుంది. సరైన దిశలో కుళాయిని ఏర్పాటు చేస్తే చంద్రుడి బలం మీపై ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

Exit mobile version