Site icon vidhaatha

Second Marriage | రెండో పెళ్లికి ఈ ఐదు రాశుల వారు ఆస‌క్తి చూపిస్తార‌ట‌..! మ‌రి మీ రాశి ఉందా..?

Second Marriage | పెళ్లంటే( Marriage ) నూరేళ్ల పంట‌.. పంచ‌భూతాల సాక్షిగా మూడు ముళ్లు, ఏడు అడుగుల బంధంతో ఒక్క‌ట‌య్యే జంట‌( Couple ).. క‌ల‌కాలం క‌లిసిమెలిసి ఉండాల‌ని కోరుకుంటారు. కానీ కొన్ని జంటల్లో పెళ్లైన కొద్ది రోజుల‌కే క‌ల‌హాలు మొద‌ల‌వుతాయి. అది భ‌ర్త నుంచి కావొచ్చు.. అత్త‌మామ‌లు, ఆడ‌ప‌డుచులు కావొచ్చు. ఇటు భార్య నుంచి కావొచ్చు.. వారి త‌ల్లిదండ్రుల నుంచి కావొచ్చు. ఇలాంటి జంట‌లు నూరేళ్లు ఎక్క‌డా..? ప‌ట్టుమ‌ని ప‌ది రోజులు కూడా సంసారం సాఫీగా చేయ‌లేరు. చికాకులు ప‌డుతూ.. మ‌న‌స్ప‌ర్థ‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతుంటారు. ఈ క‌ల‌హాలు మితిమీరితే చివ‌ర‌కు విడాకులు కోరుకుంటారు. అలా విడాకులు( Divorce ) తీసుకునే వారి సంఖ్య కూడా ఎక్కువే.

ఇక విడాకులు తీసుకున్నాక ఎవ‌రి దారినా వారి ఉంటారా..? అది ఉండ‌దు. మ‌రొక‌రితో ప్రేమ‌( Love )ను పొందాల‌ని కోరుకుంటారు. దాంతో రెండో పెళ్లి( Second Marriage )కి కూడా సిద్ధ‌ప‌డుతుంటారు. మొద‌టి పెళ్లాం వ‌ద్దు.. రెండో పెళ్లాం ముద్దు అన్న రీతిలో రెండో వివాహం కోసం తాప‌త్ర‌య‌ప‌డుతుంటారు. ఇక ఎలాగూ విడాకులు తీసుకున్నాం కాబ‌ట్టి.. అంద‌ర్నీ ఒప్పించి రెండో పెళ్లి కూడా చేసుకుంటారు. అలా రెండో పెళ్లి చేసుకున్న వారిలో కొంద‌రు సంసార జీవితాన్ని హాయిగా గ‌డిపితే.. మ‌రికొంద‌రు మ‌ధ్య‌లోనే వేధింపుల‌కు గుర‌వుతుంటారు.

అయితే జోతిష్యశాస్త్రం( Horoscope ) ప్ర‌కార‌మే చాలా వ‌ర‌కు వివాహాలు జ‌రుగుతుంటాయి. గ్ర‌హాల సంచారం కూడా పెళ్లిళ్ల‌పై ప్ర‌భావం చూపిస్తాయ‌ని పండితులు చెబుతున్న మాట‌. వ్యక్తుల జీవితంలో మంచి చెడులు గ్రహాల సంచారం పై ఆధారపడి పడి ఉంటాయి. జనన సమయం, తేదీ, నక్షత్రాన్ని బ‌ట్టి ఒక్కొక్క‌రి వైవాహిక జీవితం( Marriage Life ) ఒక్కోలా సాగుతుంద‌ని చెబుతున్నారు పండితులు. కొన్ని రాశులకు చెందిన వ్యక్తుల దాంపత్య జీవితం సరిగ్గా సాగదు. కొన్ని రాశుల వ్యక్తుల వైవాహిక జీవితంలో స్థిరత్వం, శాంతి, ప్రేమ, స్వేచ్ఛ వంటివి లోపిస్తాయి. అప్పుడు మొదటి పెళ్ళికి గుడ్ బై చెప్పేసి.. రెండో పెళ్లి చేసుకోవడానికి ఎక్కువ‌గా ఆసక్తి చూపిస్తార‌ట‌. కొత్త భాగస్వామిని జీవితంలోకి ఆహ్వానిస్తార‌ట‌. మ‌రి రెండో పెళ్లి చేసుకునే అవకాశం ఎక్కువగా ఉన్న రాశులు( Zodiac Signs ) ఏమిటో తెలుసుకుందాం..

వృష‌భ రాశి (Taurus)

వృష‌భ రాశి వారు వివాహ సంబంధాల‌లో స్థిర‌త్వం, భ‌ద్ర‌త‌ని కోరుకుంటార‌ని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. తొలి వివాహం వారి అంచ‌నాల‌కు అనుగుణంగా లేక‌పోతే.. రెండో పెళ్లికి రెడీ అయిపోతార‌ట‌. మొద‌టి పెళ్లికి క్ష‌ణాల్లోనే శుభం కార్డు వేస్తార‌ట‌. తాము కోరుకునే స్థిర‌త్వం, భ‌ద్ర‌త‌ను అందించే జీవిత భాగ‌స్వామి కోసం వెతుకుతార‌ట‌.

తులా రాశి (Libra)

తులా రాశి వారు త‌మ దాంప‌త్య జీవితంలో సామ‌ర‌స్య వాతావ‌ర‌ణాన్ని కోరుకుంటార‌ట‌. స‌మ‌తుల్య‌త కూడా ముఖ్య‌మైన‌దిగా భావిస్తార‌ట‌. మొద‌టి వివాహం చేసుకున్న త‌ర్వాత భార్య నుంచి ఈ రెండు ల‌భించ‌క‌పోతే.. రెండో వివాహం చేసుకునేందుకు సిద్ధ‌ప‌డుతుంటార‌ట‌.

వృశ్చిక రాశి (Scorpio)

వృశ్చిక రాశి వారికి సాధారణంగానే భావోద్వేగం ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌. కాబ‌ట్టి తొలి వివాహం త‌మ అభిరుచికి అనుగుణంగా లేద‌ని భావించినా.. ప్రశంసలు లభించడం లేదని భావించినా వీరు రెండవ వివాహం వైపు మొగ్గు చూపుతార‌ట‌. తమ అభిరుచికి సరిపోయే భాగస్వామి కోసం వైపు ప‌రుగులు పెడుతార‌ట‌.

ధనుస్సు రాశి (Sagittarius)

ధ‌నుస్సు రాశి వారు స్వేచ్ఛ‌కు ఎంతో విలువ ఇస్తార‌ట‌. సాంప్ర‌దాయ వివాహం చేసుకున్న‌ప్ప‌టికీ స్వేచ్ఛ ల‌భించ‌క‌పోతే.. ఊపిరాడ‌డం లేద‌ని భావిస్తార‌ట‌. ఈ క్ర‌మంలో మొద‌టి భార్య‌తో నిర్బంధంగా ఉంద‌ని భావిస్తే.. స్వేచ్ఛ‌గా జీవించే మ‌రో భాగ‌స్వామి కోసం వెతుకుతార‌ట‌.

కుంభ రాశి (Aquarius)

కుంభ రాశి వారు ప్ర‌త్యేకంగా వ్య‌క్తిత్వానికి అధిక ప్రాధాన్య‌త ఇస్తార‌ట‌. వీరి మొదటి వివాహం తమ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉందని భావించినా, తమ ఆసక్తిని, అభిరుచిని కొనసాగించడానికి అడ్డు వస్తుందని భావించినా.. మొదటి పెళ్ళికి శుభం కార్డు వేస్తార‌ట‌. త‌ద్వారా తన విలువ‌ల‌కు ప్రాధాన్య‌త ఇస్తూ.. తన ఆసక్తిని అర్ధం చేసుకునే వ్యక్తితో రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధ‌ప‌డుతార‌ట‌.

ఈ రాశుల వారు మొద‌టి పెళ్లికే క‌ట్టుబ‌డి ఉంటారట‌..!

మేషం, మిథునం, కర్కాటకం, సింహ, కన్య, మకరం, మీన రాశుల వారు తమ మొదటి వివాహం పట్ల చాలా నిబద్ధత కలిగి ఉంటారు. వీరు ఎటువంటి పరిస్థితి ఎదురైనా, ఏ విషయంలోనైనా తమ భాగస్వామికి అండగా నిలుస్తారు. తమ వివాహ బంధాన్ని నిలబెట్టుకోవడానికి కష్టపడి పనిచేస్తారు. రెండవసారి వివాహం చేసుకోవాలనే ఆలోచన వీరి మనసులోకి ఎప్పటికీ రాద‌ని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

Exit mobile version