Site icon vidhaatha

15.07.2024 సోమవారం రాశిఫ‌లాలు.. ఈ రాశుల వారికి ఆర్థిక న‌ష్టాలు..!

మేషం

మేషరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి కార్యసిద్ధి విజయప్రాప్తి ఉంటాయి. ప్రతిభతో పనిచేసి విజయపధంలో దూసుకెళ్తారు. ఇంటా బయటా మిమ్మల్ని అందరు ప్రశంసలతో ముంచెత్తుతారు. మేధోపరమైన చర్చలలో పాల్గొంటారు.

వృషభం

వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు చేపట్టిన పనుల్లో విజయం సాధించాలంటే సమయానుకూలంగా నడుచుకుంటే మంచిది. నూతన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు. ఆర్ధిక పురోగతి ఉంటుంది.

మిథునం

మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. నమ్మించి మోసం చేసే వారి కారణంగా అవమానాలకు గురి కావాల్సి వస్తుంది. వ్యాపారులకు నూతన వ్యాపారం ప్రారంభించడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి.

కర్కాటకం

కర్కాటకరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. చేపట్టిన పనుల్లో ఆలస్యం, ఆటంకాలు ఉంటాయి. సందర్భానుసారంగా నడుచుకుంటే మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటే మంచిది. కుటుంబ సభ్యులతో కలహాలు ఉండవచ్చు.

సింహం

సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆటంకాలున్నా అధిగమిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని కోల్పోకండి. ఆరోగ్యం సహకరిస్తుంది. సంపద పెరుగుతుంది. మీరు మానసికంగా గంభీరంగా ఉంటారు.

కన్య

కన్యారాశి వారికి ఈ రోజు మంగళకరమైన రోజు. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. కుటుంబంలో శాంతి సౌఖ్యం నెలకొంటాయి. కోపం అదుపులో ఉంచుకోవాలి. ఆర్థిక సంబంధమైన లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి.

తుల

తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మంచి విజయాలను సొంతం చేసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు సమర్ధవంతంగా నిర్వహిస్తారు. మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారు. ఉద్యోగులకు ప్రమోషన్లు, బదిలీలు ఉండవచ్చు. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది.

వృశ్చికం

వృశ్చికరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశముంది. ఆపరేషన్ కూడా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో గొడవకు దారితీసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వృధా ఖర్చులు ఉండవచ్చు.

ధనుస్సు

ధనుస్సురాశి వారికి ఈ రోజు లాభదాయకమైన రోజు. కుటుంబ జీవితాన్ని సంపూర్ణంగా ఆనందిస్తారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. కుటుంబ సభ్యులతో విందు వినోదాలలో పాల్గొంటారు. వ్యాపారులకు భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది.

మకరం

మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. వృత్తి వ్యాపారాలలో సాధారణ ఫలితాలు ఉంటాయి. ఆదాయం పెరుగుదల ఉండాల్సినంతగా ఉండదు. ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. కుటుంబ వ్యవహారాల్లో అందరినీ సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటే మేలు.

కుంభం

కుంభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యం అంతగా సహకరించదు. అన్ని రంగాల వారికి పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. వ్యాపారంలో పోటీదారుల నుంచి కొత్త సవాళ్లు ఎదురు కావచ్చు. ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆర్థికంగా నష్టాలు ఉండవచ్చు.

మీనం

మీనరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. తెలిసీ తెలియక అనైతికమైన కార్యకలాపాలలో ఇరుక్కోవడం మిమ్మల్ని ప్రమాదంలో పడవేస్తుంది. సమాజంలో పేరున్న వ్యక్తుల మద్దతుతో సమస్యల నుంచి బయట పడతారు. కోపం అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.

Exit mobile version