Mahalaya Amavasya | మహాలయ అమావాస్య( Mahalaya Amavasya )కు హిందూ మతంలో ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది. ఈ రోజున కుటుంబంలో చనిపోయిన పూర్వీకుల ఆత్మలను శాంతింపజేసేందుకు ప్రత్యేక పూజలు చేసి.. వారిని గౌరవిస్తుంటారు. పూర్వీకులను పూజించే ఈ మహాలయ అమావాస్య( Amavasya ) రోజున ఈ నాలుగు పనులు చేయకూడదని జ్యోతిష్య పండితులు హెచ్చరిస్తున్నారు. ఈ పనులు చేయడం ప్రతికూల, దుష్ట శక్తులు వెంటాడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
చాలా మంది ఆదివారం గోళ్లు, జుట్టు కత్తిరించుకుంటారు. కానీ ఈ ఆదివారం రోజున మహాలయ అమావాస్య వచ్చింది కాబట్టి.. గోళ్లు, జుట్టు కత్తిరించుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. గోళ్లు, జుట్టు కత్తిరిస్తే.. భయంకరమైన దుష్ప్రభావాలకు గురయ్యే ప్రమాదం ఉందని పండితులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు తల స్నానానికి కూడా దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
ఆదివారం వచ్చిందంటే చాలు.. సమయం తీసుకోని తలకు నూనె పెట్టుకుంటారు. కానీ ఆదివారం నాడు అమావాస్య వచ్చింది కాబట్టి తలకు నూనె రాసుకోకూడదని పండితులు సూచిస్తున్నారు. నూనె శనితో ముడిపడి ఉంటుంది కాబట్టి. అయితే నూనెను దానం చేయడం మూలంగా.. ఇది కుండలి నుంచి శని దోషాన్ని తొలగిస్తుందని పండితులు చెబుతున్నారు.
అమావాస్య రోజు మాంసం, మద్యం కొనడం, తినడం అశుభమని చెబుతారు. ఈరోజు మాంసాహారం తింటే కుండలిపై ప్రతికూల ప్రభావం పెరుగుతుంది. ఇది ఆర్థిక పరిస్థితికి హానికరం. కాబట్టి మాంసానికి, మద్యానికి దూరంగా ఉంటే మంచిదని పండితులు సూచిస్తున్నారు.
చీపురు లక్ష్మీ దేవితో సంబంధం కలిగి ఉంటుందని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అమావాస్య రోజున చీపురు కొంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఇది డబ్బు ప్రవాహాన్ని ఆపివేస్తుంది. ఇంట్లో ప్రతికూల శక్తి నింపుతుంది. ఆరోగ్యం కోసం ఖర్చు పెరగవచ్చు. కాబట్టి చీపురు కొనకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు చెబుతున్నారు.