Site icon vidhaatha

TTD | తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ అలెర్ట్‌..! మే నెలలో జరిగే విశేష ఉత్సవాలు ఇవే..

TTD | కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం దేవస్థానం షెడ్యూల్‌ను ప్రకటించింది. తిరుమలలో మే మాసంలో జరిగితే విశేష ఉత్సవాలకు సంబంధించిన ఉత్సవాల వివరాలను టీటీడీ ప్రకటించింది. మే నెలలో పద్మావతి దేవి పరిణయోత్సవాలతో పాటు గోవింద రాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. మే 17 నుంచి 19 వరకు పద్మావతి దేవి అమ్మవారి ఆలయంలో పరిణయోత్సవాలు జరుగుతాయని పేర్కొంది. మే 10న అక్షయతృతీయ ఉంటుందని తెలిపింది. అలాగే మే 16 నుంచి 24 వరకు గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు పేర్కొంది.

మే నెలలో జరిగే ఉత్సవాల వివరాలు ఇవే..

మే 3న భాష్యకారుల ఉత్సవాలు ప్రారంభం
⁠మే 4న‌ సర్వ ఏకాదశి.
⁠మే 10న అక్షయతృతీయ.
⁠ ⁠మే 12న భాష్యకారుల శాత్తుమొర, రామానుజ జయంతి, శంకర జయంతి జరుగనున్నాయి.
⁠ ⁠మే 17 నుంచి 19వ తేదీ వరకు పద్మావతి అమ్మవారి పరిణయోత్సవాలు
మే 22న నృసింహ జ‌యంతి, త‌రిగొండ వెంగ‌మాంబ జ‌యంతి.
మే 23న అన్నమాచార్య జ‌యంతి, కూర్మ జ‌యంతి.

Exit mobile version