Site icon vidhaatha

Shravana Masam | శ్రావ‌ణ సోమ‌వారాల్లో శివ‌లింగానికి తేనేతో అభిషేకం చేస్తే.. పెళ్లి కోరిక నెర‌వేరుతుంద‌ట‌..!

Shravana Masam | ఇవాళ శ్రావ‌ణ మాసంలో రెండో సోమ‌వారం. శ్రావ‌ణ సోమ‌వారాలు ప‌ర‌మేశ్వ‌రుడి ఆరాధ‌న‌కు ఎంతో విశిష్ట‌మైన‌వి. శ్రావ‌ణ సోమ‌వారం నాడు శివ‌లింగానికి అభిషేకం చేస్తే ఐశ్వ‌ర్య‌ప్రాప్తి క‌ల‌గ‌డంతో పాటు ఆర్థిక బాధ‌లు దూర‌మ‌వుతాయ‌ని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అయితే అభిషేకంలో వినియోగించే ప‌దార్థాల‌కు కూడా ఎంతో ప్రాముఖ్య‌త ఉంది. ఒక్కో ప‌దార్థానికి ఒక్కో విశిష్ఠ‌మైన ఫ‌లితం ఉంటుంద‌ని చెబుతున్నారు. మ‌రి ఆ విశిష్ఠ విష‌యాలు ఏంటో తెలుసుకుందాం..

-నిత్యం గొడ‌వ‌ల‌తో స‌త‌మ‌త‌మ‌య్యే దంప‌తులు శ్రావ‌ణ సోమ‌వారం రోజున పంచామృతాల‌తో శివ‌పార్వ‌తుల‌కు అభిషేకం చేస్తే అన్యోన్య దాంప‌త్యం క‌లుగుతుంది. అంతేకాకుండా వైవాహిక బంధం కూడా దృఢ‌ప‌డుతుంది.

-శ్రావణ సోమవారం రోజు శివలింగానికి తేనెతో అభిషేకం చేసి బిల్వ పత్రాలతో పూజిస్తే వివాహం ఆలస్యం అయ్యే వారికి పెళ్లి కోరిక త‌ప్ప‌కుండా నెర‌వేరుతుంద‌ట‌.

-శ్రావణ సోమవారం శివపార్వతులకు కుంకుమపువ్వు కలిపిన పచ్చి పాలను నివేదిస్తే వంశాభివృద్ధి కలుగుతుంది.

-శ్రావణ మాసంలో ప్రతి సోమవారం గంగాజలంతో శివుడి అభిషేకిస్తే ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది. ఆర్థిక బాధలు దూరమవుతాయి.

-వ్యాపారంలో కష్టనష్టాలతో బాధ పడేవారు, ఉద్యోగంలో స్థిరత్వం కోరుకునే వారు శ్రావణ సోమవారం రోజు చెరకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే అన్ని సమస్యల నుంచి బయట పడతారు.

-శ్రావణ సోమవారం రోజు నల్ల నువ్వులు కలిపిన నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలు, మానసిక బాధలు శాశ్వతంగా దూరమవుతాయి.

Exit mobile version