Eye twitching | ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంగా కన్ను( Eye ) అదిరిన సందర్భం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నిరంతరం కన్ను అదురుతూనే(Eye twitching ) ఉంటుంది. అలాంటప్పుడు ఏదో కీడు జరగబోతుందని, లేదంటే మంచి జరిగే అవకాశం ఉంటుందని విశ్వసిస్తుంటాం. అయితే స్త్రీ( Woman ), పురుషులకు ఏ భాగం వైపు కన్ను అదిరిందనే దాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఎడమ కన్ను( Left Eye ) అదిరితే స్త్రీలకు మంచిదా..? శుభప్రదమేనా..? వారు జీవితంలో ఏం జరగబోతుందనే విషయాలను తెలుసుకుందా..
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం.. స్త్రీలకు ఎడమ కన్ను అదిరితే మంచిదేనట. వారి జీవితంలో ఏదో మంచి జరగబోతుందని సూచనగా భావించాలట. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందట. ప్రేమ ఫలించడం( Love Success ), వృత్తి ఉద్యోగాల్లో రాణించడంం, ఆర్థిక సమస్యలు( Finance Problems ) పరిష్కారం కావడం, న్యాయపరమైన చిక్కులు పరిష్కారం కావడం వంటివి జరగొచ్చని పండితులు చెబుతున్నారు.
భార్యాభర్తల మధ్య బంధం బలోపేతం..
అంతేకాకుండా ఎడమ కన్ను అదిరిన స్త్రీల కుటుంబాల్లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయట. కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం ఏర్పడుతుందట. భార్యాభర్తలు( Wife and Husband ) ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడిపే అవకాశం లభిస్తుందట. దంపతుల( Couples ) మధ్య బంధం బలోపేతమవుతుందట.
రెండు రెప్పలు అదిరితే పెళ్లికి సంకేతమట..!
ఇక కన్ను ఎప్పుడైన మొత్త అదరదు. కంటిలో ఏదో ఒక భాగం మాత్రమే అదురుతుంది. కంటి పైరెప్ప, కింది రెప్ప లేదా రెండు రెప్పలు అదిరితే ఆమెకు త్వరలోనే పెళ్లి( Marriage ) అవుతుందని సంకేతమట. కంటిలో ముక్కుకు దగ్గరగా ఉండే భాగంలో మాత్రమే అదిరితే త్వరలో ఆమె తల్లి( Mother ) అయ్యే అవకాశం ఉంటుందట.