Rakhi Festival | తెలుగు పంచాంగం( Telugu Panchangam ) ప్రకారం, ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి( Shravana Purnima ) రోజున రాఖీ పండుగ( Rakhi Festival ) జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున సోదర సోదరీమణుల మధ్య ప్రేమనురాగాలకు ప్రతీకగా రక్షా బంధన్( Raksha Bandhan ) పండుగను జరుపుకుంటారు. పంచాంగ ప్రకారం ఈ ఏడాది 19 ఆగస్టు 2024 సోమవారం నాడు రాఖీ పండుగ జరుపుకోనున్నారు.
అయితే ఈ ఏడాది రాఖీ పండుగ మరింత ప్రత్యేకంగా ఉండబోతోంది. ఈ సంవత్సరం రాఖీ పూర్ణిమ రోజున అలాంటి అద్భుతమైన గ్రహ సంయోగం జరుగుతోంది. ఎందుకంటే జ్యోతిష్యం ప్రకారం 90 సంవత్సరాల తర్వాత ఈ ఏడాది రాఖీ పండగ రోజున నాలుగు శుభ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ సమయంలో రాఖీ కట్టడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. తెలుగు పంచాంగం ప్రకారం రాఖీ పండగ రోజున సర్వార్థ సిద్ధి యోగం, రవియోగం, శోభ యోగం, శ్రవణ నక్షత్రాలతో మహా సంయోగం జరుగబోతోంది. తద్వారా నాలుగు శుభ గ్రహాలు కలిసిపోతున్నాయి. గ్రహాలు, నక్షత్రాల ఈ అద్భుతమైన కలయిక అన్నదమ్ముల సంబంధాన్ని బలపరుస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
రాఖీ కట్టేందుకు అత్యంత శుభ సమయం ఇదే..
ఈ ఏడాది 19 ఆగస్టు 2024 సోమవారం ఉదయం శ్రావణ మాసం శుక్ల పక్షంలో పౌర్ణమి తిథి తెల్లవారుజామున 3:04 గంటలకు ప్రారంభమవుతుంది. అదే రోజు రాత్రి 11:55 గంటలకు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో సోదరులకు రాఖీ కట్టేందుకు సోమవారం మధ్యాహ్నం 1:30 గంటల నుంచి రాత్రి 9:08 గంటల వరకు శుభ సమయంగా పండితులు చెబుతున్నారు. మధ్యాహ్నం 1:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:39 గంటల వరకు మరింత ప్రత్యేకంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.
భద్ర కాలంలో రాఖీ అసలు కట్టకూడదు..
శాస్త్రాల ప్రకారం, భద్ర కాలంలో ఎలాంటి శుభకార్యాలు జరుపుకోకూడదు. రాఖీ పండుగ రోజున భద్ర కాలం ఉంటే రాఖీ కట్టుకోకూడదు. అయితే ఆగస్టు 19 సోమవారం మధ్యాహ్నం 1:30 గంటల వరకు భద్ర కాలం ఉంటుంది. అందుకే ఈ సమయం పూర్తయ్యాకే రాఖీ పండుగను జరుపుకోవాలి. అంటే సోదరులకు మధ్యాహ్నం 1:30 గంట తర్వాత రాఖీ కట్టాలి.